రోజు ఉదయం ఈ ఒక్కటి తీసుకుంటే ఫుల్ డే సూపర్ ఎనర్జిటిక్ గా ఉండటం ఖాయం!

ఉరుకుల పరుగుల జీవితంలో రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండటం అనేది చాలా మందికి అసాధ్యంగా మారింది.కొందరైతే మధ్యాహ్నానికే నీరసంగా మారుతుంటారు.

పని పై ఏకాగ్రత పెట్టలేకపోతుంటారు.ఇందుకు ప్రధాన కారణం మీ శరీరానికి అవసరం అయ్యే పోషకాలు అందకపోవడమే.

అయితే ఇప్పుడు చెప్పబోయే మిల్క్ ను రోజు ఉదయం తీసుకుంటే కనుక ఫుల్ డే మీరు సూపర్ ఎనర్జిటిక్ గా ఉంటారు.అదే సమయంలో మరెన్నో ఆరోగ్య లాభాలు సైతం పొందుతారు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మిల్క్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పది బాదం పప్పులు ( Almonds )వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.అలాగే మరొక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు, నాలుగు జీడిపప్పులు, నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న అవిసె గింజలు( Flax seeds ), ఖర్జూరం, జీడిపప్పును వాటర్ తో సహా వేసుకోవాలి.

అలాగే పొట్టు తొలగించిన బాదంపప్పు మరియు వన్ టేబుల్ స్పూన్ పీనట్ బట( Peanut Butter (ర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన మిల్క్ సిద్ధం అవుతుంది.ఇది వేగన్ మిల్క్.

దీనిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.అలాగే కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ బి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.

ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.ఈ వేగన్ మిల్క్ ను రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఒక గ్లాసు చొప్పున తీసుకోవాలి.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

ఇలా చేస్తే నీరసం, అలసట వంటివి మీ దరిదాపుల్లోకి కూడా రావు.రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.

Advertisement

అలాగే ఈ వేగన్ మిల్క్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి.నరాల బలహీనత దూరం అవుతుంది. జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది.

వెయిట్ లాస్ అవుతారు.జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా సైతం పెరుగుతుంది.

తాజా వార్తలు