బీసీసీఐ కి తలనొప్పిగా మారిన డ్రీమ్ 11 ఐపీఎల్ స్పాన్సర్ షిప్...!

మార్చి నెలలో నిర్వహించాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదాపడుతూ సెప్టెంబర్ 19 వ తారీకు నుండి యుఏఈ దేశంలో సిరీస్ ని మొదలు పెట్టబోతుంది బిసిసిఐ.

అయితే జూలై నెలలో చైనా- భారత్ ఘర్షణల నేపథ్యంలో భాగంగా భారత సైనికులు 20 మంది పైగా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలో భారత దేశంలో బాయ్ కట్ చైనా అనే ఉద్యమం పెద్ద ఎత్తున చెలరేగింది.అయితే ఇది వరకే 5 సంవత్సరాల కాలం పాటు ఐపీఎల్ కు 2018లో స్పాన్సర్ గా వ్యవహరించేందుకు చైనా మొబైల్ తయారీ సంస్థ వివో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది.

అయితే ఇరు దేశాల మధ్య ఘర్షణలు కారణంగా వివో సంస్థ ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుండి వైదొలగింది.ఇక ఈ విషయంపై అనేక కంపెనీల తో ఐపీఎల్ కు సంబంధించి స్పాన్సర్ షిప్ అందించే విషయంలో సంప్రదింపులు జరగగా చివరికి డ్రీమ్ 11 తో ఈ స్పాన్సర్ షిప్ ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇకపోతే సెప్టెంబర్ 19 నుండి మొదలు కాబోతున్న ఐపీఎల్ కు ఒక్కొక్క జట్టు దుబాయ్ చేరుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాయి.అయితే ఇప్పటివరకు ఐపీఎల్ 2020 సీజన్ కు సంబంధించి ఇంకా పూర్తి షెడ్యూల్ ను ఇంకా ప్రకటించలేదు.

Advertisement

అయితే ఇప్పుడు డ్రీమ్ 11 స్పాన్సర్ షిప్ దక్కించుకోవడంతో అభిమానులు ఐసీసీ పై గుర్రుగా ఉన్నారు.దీనికి కారణం ఈ కంపెనీ కూడా చైనా దేశంతో సంబంధాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.ఈ కంపెనీలో చైనా దేశానికి సంబంధించిన టెన్ సెంట్ కంపెనీ సంబంధించి 10 శాతం వరకు పెట్టుబడులు ఉన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో భారతదేశ క్రికెట్ అభిమానులు టైటిల్ స్పాన్సర్ గా డ్రీమ్ 11 తప్పుకోవాలంటూ డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి.కేవలం పూర్తిగా భారతదేశానికి సంబంధించిన కంపెనీ కి మాత్రమే హక్కులు ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇకపోతే ఈ విషయం గురించి బీసీసీఐ పాలకవర్గం కానీ, డ్రీమ్ 11 యాజమాన్యం కానీ స్పందించాల్సి ఉంది.ప్రస్తుతానికి డ్రీమ్ 11 కంపెనీ ఈసారికి టైటిల్ స్పాన్సర్ గా కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు