వరద ముంపుకు గురైన ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ గ్రామాల ప్రజలకు అండగా ఉంటాం:ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినీత్.

జి ఐపిఎస్ ఆదేశాల మేరకు చర్ల మండలంలో వరద ముంపుకు గురైన గుత్తికోయ గ్రామాలను గుర్తించి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న 450 కుటుంబాలకు మొదటి విడతగా పాల్వంచ,నవభారత్ కంపెనీ వారి సౌజన్యంతో,చర్ల పోలీసుల ఆధ్వర్యంలో చర్ల పోలీస్ స్టేషన్లో నిత్యవసర వస్తువులను అందజేశారు .

అదే విధంగా భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్యుల సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆదివాసీ గ్రామాల ప్రజలకు అన్ని విభాగాలలో చికిత్సలు నిర్వహించి మందులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డా.వినీత్.జి ఐపిఎస్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో సంభవించిన వరదలు కారణంగా అవస్థలు పడుతున్న ఆదివాసీ గ్రామాలలోని ప్రజలకు జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

ముఖ్యంగా చర్ల,దుమ్ముగూడెం మండలాల్లోని వరద ముంపునకు గురైన గ్రామాలను గుర్తించి విడతల వారీగా పోలీసుల ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు.వరద ముంపు బాధితులకు అండగా ఉండటం కోసం తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్న నవభారత్ కంపెనీ యాజమాన్యానికి మరియు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.

విష జ్వరాల బారినపడుతూ వైద్య సదుపాయాలు లేక వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆదివాసీల కోసం అడగగానే వచ్చి వైద్య సేవలందిస్తున్న భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్య బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఆదివాసి గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా నిత్యం వారికి అందుబాటులో ఉంటూ వారితో మమేకమవుతూ విధులు నిర్వర్తిస్తున్న చర్ల సిఐ అశోక్,ఎస్సైలు రాజువర్మ,వెంకటప్పయ్య మరియు సిబ్బందిని అభినందించారు.

Advertisement

భవిష్యత్తులో ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలియజేసారు.అనంతరం అక్కడ పాల్గొన్న ఆదివాసీలకు భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్, నవభారత్ డైరెక్టర్ రమేష్,డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్,సీఆర్పిఎఫ్ అధికారులు,చర్ల సిఐ అశోక్,ఎస్సైలు రాజువర్మ,వెంకటప్పయ్య మరియు సిబ్బంది పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు