విదేశీ టూరిస్ట్ ల కోసం గ్రామస్తుల సైన్ బోర్డు ! సోషల్ మీడియాలో వైరల్

విదేశాలకి చెందిన పర్యాటకులు గిరిజన ప్రాంతాలలో, మారుమూల తండాలలో పర్యటించే సమయంలో స్థానిక ప్రజలతో వారికి భాష సమస్య వస్తుంది.

స్థానిక భాషలో అక్కడ పర్యాటక విశేషాలు విదేశీ పర్యాటకులకి చెప్పిన కూడా అర్ధం కావు.

కొన్ని చోట్ల టూరిస్ట్ గైడ్ లు ఉన్నా కూడా మరీ మారుమూల ప్రాంతాలలో ఉండరు.దీంతో విదేశీ పర్యాటకులు స్థానిక ప్రజల మీద కాస్తా విసుగు చూపిస్తారు.

ఇంగ్లీష్ నేర్చుకుంటే వీరి సొమ్మేంపోతుంది అని ఆంగ్లంలో తిడుతూ ఉంటారు.ఇలాంటి కామెంట్స్ స్థానిక ప్రజలకి కొంత వరకు అర్ధమవుతాయి.

అయితే తమ మాతృభాష మీద ఉన్న మక్కువ పరాయి భాష మీద వారికి ఉండదు.ఇదే విషయాన్ని విదేశీ పర్యాటకులకి అర్ధమయ్యే విధంగా ధాయలాండ్ దేశంలో టూరిస్ట్ గ్రామంలో ప్రజలు విదేశీ టూరిస్ట్ లు తమని తిట్టుకోకుండా ఉండటానికి ముందుగానే ఒక సైన్ బోర్డు పెట్టారు.

Advertisement

పర్యటకుల అతితో విసిగిపోయిన గ్రామస్థులు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొన్నారు.తాము చెప్పాలనుకున్న విషయాన్ని ఇంగ్లీష్ భాషలో బోర్డు మీద రాసి గ్రామం పొలిమేరలో ఉంచారు.

ఇంగ్లీష్ మాట్లాడట్లేదంటూ విసుగు చెందేవారు తమకు కూడా థాయ్ భాష రాదని గుర్తుపెట్టుకోవాలి అని బోర్డు పెట్టేశారు.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

చాలా మంది నెటిజన్లు స్థానిక గ్రామస్థులకు మద్దతు పలుకుతున్నారు.విదేశీ టూరిస్టులు అక్కడికి వెళ్ళేటపుడు లోకేషన్స్ చూసి ఎంజాయ్ చేయాలి కాని ఇలా స్థానిక ప్రజలని తిట్టుకోవడం సరైన పద్ధతి కాదంటూ చెబుతున్నారు.

ప్రకృతి అందాలు ఆస్వాదించడానికి భాషతో పనేముంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి థాయ్ దేశంలో చేసిన ఆ పని ఇప్పుడు అందరికి ఆకర్షించింది అని చెప్పాలి.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు