ఆఫ్గానిస్థాన్ లో ప్రజాస్వామ్యం పాలనకు కాలం చెల్లిపోయిందని ఇక తాలిబాన్లు ప్రభుత్వం వచ్చిందని ఈ సమయంలో తాలిబాన్లు తమ దేశంలో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వవద్దని భారత్ డిమాండ్ చేసింది.ఆఫ్గానిస్థాన్ సంక్షోభం నేపథ్యంలో జెనీవాలోని ఐరాస మానవహక్కుల మండలి HRC ప్రత్యేకంగా సమావేశం అయింది.
ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి ఇంద్రామణి పాండే బుధవారం చర్చల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా భారత్ తరుపున ఇంద్రామణి పాండేతన బలమైన వాదన వినిపించారు.
ఆఫ్ఘనిస్తాన్ లో కేవలం తాలిబాన్లు మాత్రమే ఉండాలని వారు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇవ్వొద్దని డిమాండ్ చేశారు.ఆఫ్గానిస్థాన్ లో నెలకొన్న పరిస్థితులు పొరుగుదేశాలకు ఇబ్బందిగా మారకూడదని సూచించారు.
తొలత శాంతిమంత్రం పటించిన తాలిబాన్లు ఇప్పుడు అరాచకాలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రోజూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు.
ప్రాంతీయ, శాంతిభద్రతలు ఆ దేశ పరిస్థితులపై ఆధారపడి ఉందని వివరించారు.

ఆఫ్గానిస్థాన్ తాలిబన్లతో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంబంధాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జమ్మూకాశ్మీర్ భద్రత విషయమై ఆందోళనలు నెలకొన్నాయని వివరించారు.ఆఫ్గాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారన్నారు.
అక్కడ అఫ్గాన్ పౌరులతో పాటు ఐరాస సిబ్బంది, దౌత్య సిబ్బందికి భద్రత కల్పించాలన్నారు.