అకాల వర్షాలతో అధైర్య పడొద్దు:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:అకాల వర్షాలతో రైతాంగం అధైర్య పడకుండా భరోసా కల్పించాలని జిల్లా అధికార యంత్రాంగాన్నీ మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు.

ప్రభుత్వం నుండి రైతులకు భరోసా అందించి వారిలో ధీమా కలిగించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావుకు సూచించారు.

శుక్రవారం రాత్రి నుండి కురుస్తున్న అకాల వర్షాలపై జిల్లా కలెక్టర్ వెంకట్రావుతో మంత్రి జగదీష్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు సూచనలు అందిస్తున్నారు.ఈ మేరకు ఈ ఉదయం నుండి రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చెయ్యడంతో పాటు జాయింట్ కలెక్టర్ మోహన్ రావు ఇతర ప్రభుత్వ యంత్రాంగం హుటాహుటిన కొనుగోలు కేంద్రాలకు చేరుకుని రైతులకు భరోసానందిస్తున్నారు.

Don't Get Impatient With Untimely Rains , Minister Jagadish Reddy , Assurance To

రానున్న రోజుల్లో అకాల వర్షాలు సంభవించే ప్రమాదం ఉన్నందున పిడుగుల బారిన పడకుండా ఉండేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.రైతులు అధైర్యపడవద్దని ధాన్యం కొనుగోలుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Latest Suryapet News