అక్కడ గాడిదలు కూడా మున్సిపల్ ఉద్యోగులే..!

ఇదివరకు అంతగా వాహన రంగం అభివృద్ధి చెందని కాలంలో కొందరు వ్యాపారులు బరువులను మోయించడానికి బంగారాన్ని ఉపయోగించారు.

ఇప్పటికీ కూడాకొంతమంది రజకులు వారు ఉతకావలిసిన బట్టలను గాడిదలపై వేసుకుంటూ వెళ్లి అక్కడ వాటిని ఉతికి తిరిగి మళ్ళీ వాటిపైన ఇంటికి చేర్చుకుంటారు.

అయితే రోజురోజుకి వాహన రంగం ఊపందుకోవడంతో గాడిదలను ఉపయోగించుకునే వారు చాలా తక్కువ అయిపోయారు.అయితే ఈమధ్య కాలంలో కొందరు గాడిద పాలను ఉపయోగించి ఎన్నో అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చని ప్రచారం చేస్తున్నారు.

దీంతో అప్పుడప్పుడు ఇంకా గాడిదలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు.అయితే ఇది వరకు బరువును మోసే గాడిదలను అక్కడ మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నారు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను చూస్తే.టర్కీ దేశం లోని ఓ పట్టణంలో గాడిదలు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ నిత్యం ప్రజల మధ్యలోనే నడుస్తూ ఉంటాయి.

Advertisement

అక్కడి మున్సిపాలిటీలో కొన్ని పదుల సంఖ్యలో గాడిదలు వారికి కేటాయించిన పనులను మనుషులు ఎలా చేస్తారో అవి కూడా అలానే నిర్వహిస్తాయి.టర్కీ దేశంలోని మార్డిన్‌ ప్రావిన్స్‌లో అర్తుక్లు అనే ఒక పట్టణం ఉంది.

ఈ పట్టణంలో కొన్ని సంవత్సరాలుగా గాడిదలు ఊరంతా తిరుగుతూ చెత్త సేకరణ లో బిజీగా ఉన్నాయి.ఆ దేశంలో కొన్ని ప్రాంతాలలో ఇంటి సందులో కేవలం చిన్నచిన్న రహదారులు మాత్రంగా ఉంటాయి.

అలా ఉన్న ప్రదేశంలో మున్సిపల్ వాహనాలు అక్కడికి చేరుకోక పోవడంతో వాటి కోసం ఎక్కువగా ఈ దారిలోనే చెత్త సేకరణకు ఉపయోగిస్తారు అక్కడి ప్రభుత్వ అధికారులు.

ఆ నగరంలోని వీధుల్లో చెత్తను సేకరించడానికి ఒక్కొక్క గదిలో ఒక్కొక్క మున్సిపల్ ఉద్యోగి ఉంటారు.చెత్త సేకరణ కి వెళ్ళినప్పుడు ఉద్యోగి చెత్తను కలెక్ట్ చేసి ఆ చెత్తను గాడిదల ద్వారా మోపిస్తారు.ఈ దాడులతో షిఫ్ట్ పద్ధతి ప్రకారం ఉదయం 3 గంటల అలాగే సాయంత్రం 3 గంటలు విధులు నిర్వహిస్తారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఇలా ఒక్కొక్క గాడిద కనీసం ఏడు సంవత్సరాల పాటు పని చేసి రిటైర్ అవుతుంది.అలా రిటైరయ్యాక గాడిదలకు స్థానికంగా జీవించేందుకు ప్రభుత్వం దానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది.

Advertisement

ఇలా ఉద్యోగం నుంచి రిటైర్ అయిన గాడిదలను స్థానిక ప్రభుత్వ అధికారులు వాటికి భారీ సన్మాన సభ ఏర్పాటు చేసి వాటిని సన్మానించారు.ఇందులో భాగంగా వాటికి పండ్లు, కూరగాయలు ఆహారంగా అందించారు.

తాజా వార్తలు