ట్రంప్‌ కొత్త నిర్ణయం : అమెరికాలో కాలు పెట్టాలంటే ఖచ్చితంగా అది ఉండాల్సిందే

అమెరికాలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య భీమా ఉంటుంది.పెద్ద మొత్తంలో అక్కడి వారు ఆరోగ్య భీమాను చెల్లించాల్సి ఉంటుంది.

మన వద్ద ఇష్టం అయితే కట్టుకుంటాం లేదంటే పట్టించుకోం.కాని అమెరికాలో మాత్రం ఖచ్చితంగా ఆరోగ్య భీమాను పొందాల్సిందే.

ఈ నిబంధనను మరింత కఠినతరం చేయబోతున్నట్లుగా ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది.ఇకపై ఎవరైనా అమెరికాలో కాలు మోపాలంటే ఖచ్చితంగా వారికి ఆరోగ్య భీమా ఉండాల్సిందే.

అలా లేని వారికి అమెరికాలో స్థానం లేదని ట్రంప్‌ ప్రభుత్వం కొత్త జీవోను తీసుకు వచ్చింది.ఆరోగ్య భీమా లేని వారు అమెరికాలో కాలు మోపిన నెల లోపు భీమా తీసుకుంటామని హామీ ఇస్తే అప్పుడు ఒప్పుకుంటారు.

Advertisement

ఆ తర్వాత కూడా తీసుకోనట్లయితే వెంటనే వారి పాస్‌ పోర్ట్‌ మరియు వీసాలను స్వాదీనం చేసుకుని వారిని అమెరికా నుండి పంపించేస్తామని ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది.ట్రంప్‌ తీసుకు వచ్చిన ఈ కొత్త నిబంధనతో భీమా సంస్థలు అన్ని లాభాల బాటలో నడిచే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల వారు అంటున్నారు.

కొత్తగా అమెరికా వెళ్లిన వారికి ఆరోగ్య భీమా తీసుకునేంత ఆర్థిక పరిస్థితి ఉండదు.అయినా కూడా ట్రంప్‌ తీసుకు వచ్చిన ఈ ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సిందే.

Advertisement

తాజా వార్తలు