జగన్ పార్టీ పెట్టినప్పటి నుండి కూడా ఆయన వెంట ఉండి, కష్టంలో ఆయనతో నడిచిన రోజాకు మొన్నటి ఎన్నికల తర్వాత మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు.కాని మంత్రి పదవి కొన్ని సామాజిక కూర్పుల కారణంగా ఆమెకు దక్కలేదు.
మంత్రి పదవి దక్కకున్నా రోజాకు నామినేటెడ్ పదవి ఇస్తామని జగన్ అన్నాడు.అన్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ది సంస్థ ఏపీఐఐసీ చైర్మన్ పదవిని రోజాకు ఏపీ ప్రభుత్వం కట్టబెట్టిన విషయం తెల్సిందే.
రోజాకు ఆ పదవి వచ్చి నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఆమె జీత భత్యాల గురించి క్లారిటీ ఇచ్చింది.ప్రభుత్వం ఆమెకు నెలకు రెండు లక్షల జీతం మరియు ఆమె వ్యక్తిగత సిబ్బంది ఖర్చుకోసం 70 వేల రూపాయలు, వాహన సౌకర్యం కోసం 60 వేలు, అధికారిక నివాసం కోసం 50 వేలు, మొబైల్ బిల్లు 2 వేలు మొత్తం కలిపి ఆమెకు నెలకు 3.82 లక్షల రూపాయలను ప్రభుత్వం చెల్లించనుంది.ఈ నెల ఆమెకు ఇప్పటికే ఈమొత్తం ఆమె ఖాతాలో జమ చేసినట్లుగా ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
అయితే రోజా జీత భత్యాల విషయమై ప్రతిపక్ష నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.గవర్నర్, రాష్ట్రపతిల స్థాయిలో జీతాలు ఇవ్వడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.