తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఎంత చెప్పినా కూడా సమ్మెకు సిద్దం అవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది.సంస్థ ఇప్పటికే నష్టాల్లో ఉంటే కనీస బాధ్యత కూడా లేకుండా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం అవివేకం అంటూ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు ప్రయత్నించకుండా ఎప్పటికప్పుడు సమ్మెకు దిగుతూ మరింతగా నష్టాల్లో ముంచుతున్న కారణంగా వారిపై సీరియస్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.నేడు సాయంత్రం ఆరు గంటల వరకు విధుల్లో హాజరు కాని వారిని ఉద్యోగం నుండి తొలగించాలని నిర్ణయించుకుంది.
మరో వైపు ప్రతి నెల 1వ తారీకు వచ్చే ఆర్టీ ఉద్యోగుల జీతాలు ఈనెల 5వ తారీకు పూర్తి అయినా ఇంకా జమ కాలేదు.సమ్మెకు దిగిన కారణంగా ప్రభుత్వం ఉద్యోగస్తుల జీతాలను నిలిపేసినట్లుగా తెలుస్తోంది.
సమ్మె విరమించుకుంటే తప్ప ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడవంటూ ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.రేపు ఆర్టీసి ఉన్నతాధికారులు, పోలీసు శాఖ మరియు ఇతర శాఖల ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ కాబోతున్నారు.
ఆ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.నిర్ణయం ఏమో కాని ఈ నెల జీతం రాకుంటే రెండు రోజుల్లో రాబోతున్న దసరా పండుగను ఎలా జరుపుకుంటాం అంటూ ఆర్టీసీ ఎంప్లాయిస్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.







