దిగిపోతూ కూడా జాలి లేదా: హెచ్‌ 1 బీపై నిషేధం పొడిగించిన ట్రంప్

అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి వలసదారులపై కత్తి కట్టారు.ఇమ్మిగ్రేషన్ నిబంధనలను మారుస్తూ.

అవసరమైతే మరింత కఠినతరం చేస్తూ వచ్చారు.అగ్గికి ఆజ్యం పోసినట్లు కరోనా రావడంతో ఆయన మరింత రెచ్చిపోయారు.

పదవిలోంచి మరో 20 రోజుల్లో దిగిపోతూ కూడా వలసదారులపై తన వైఖరి ఎంటో చూపించారు.అమెరికాలో శాశ్వత నివాసం కల్పించే గ్రీన్ కార్డులు, వర్క్ వీసాలపై డిసెంబర్ 31 వరకు వున్న నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఏడాది ఏప్రిల్‌‌లో అమల్లోకి వచ్చిన ఈ నిషేధాల గడువు డిసెంబరు 31, 2020తో ముగియనుంది.దేశంలోకి ఇమ్మిగ్రాంట్ల‌ను నిలువ‌రించేందుకు ట్రంప్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

Advertisement

ప్రస్తుతం అమెరికాలో దాదాపు రెండు కోట్ల మంది ఫెడరల్ ప్రభుత్వం అందజేస్తున్న నిరుద్యోగ ప్రయోజనాలను పొందుతున్నారు.కరోనా నేపథ్యంలో తలెత్తిన ఆర్ధిక సంక్షోభం కారణంగా ఉపాధి కోల్పోయిన వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది.

దీంతో విదేశీయులకు ఉన్న పలు వెసులుబాట్లపై ట్రంప్ ఏప్రిల్‌ నుంచి నిషేధం విధిస్తూ వచ్చారు.తొలుత గ్రీన్‌ కార్డులపై నిషేధం విధించిన అగ్రరాజ్యాధినేత, అనంతరం దానిని హెచ్‌-1బీ, హెచ్‌-2బీ, జే-1, ఎల్‌-1 వీసాలకు కూడా వర్తింపజేశారు.

అయితే ఆయన నిర్ణయాన్ని అక్కడి సంస్థలు కోర్టుల్లో సవాల్ చేయడంతో ఎప్పటికప్పుడు ట్రంప్ మొట్టికాయలు తిన్నారు.అధ్యక్షుడి నిర్ణయాల వల్ల అమెరికాకే నష్టమని న్యాయమూర్తులు సైతం అభిప్రాయపడ్డారు.

మరోవైపు ట్రంప్‌ తీసుకున్న తాజా నిర్ణయాన్ని కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఆక్షేపించారు.అయితే, వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన తర్వాత ట్రంప్ విధించిన నిషేధాలపై తాను ఎలాంటి నిర్ణయం తీసుకుంటానన్నది మాత్రం బైడెన్ చెప్పలేదు.ఆ ఉత్తర్వుల్ని వెంటనే ఉపసంహరించడానికి వీలులేని విధానంలో ట్రంప్‌ రూపొందించి, జారీ చేసినట్లు నిపుణులు చెబుతున్నారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు