రూ.కోట్లు కుమ్మరిస్తున్న లాటరీ కేరళకు మాత్రమే సొంతమా? మనం కొనకూడదా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవే?

ఈమధ్య కాలంలో కేరళ లాటరీలు గురించిన వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.ఎందుకంటే ఇక్కడ వాటివలన రూ.

కోట్లు సంపాదించినవారు అనేకమంది వున్నారు.సదరు టికెట్ కొన్నవారికి కళ్లుచెదిరే ప్రైజ్ మనీని కట్టబెడుతున్నాయి ఆయా సంస్థలు.

వందలు పెడితే రూ.కోట్లు వచ్చిపడుతున్నాయి కాబట్టి సాధారణంగానే దీనిపై అందరికీ ఆసక్తి ఉంటుంది.ఇటీవల ఈ ఆసక్తి ఇంకా ఎక్కువైంది.

దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది.కేరళ ప్రభుత్వం విక్రయిస్తున్న ఈ లాటరీల గురించి అందరూ ఆరా తీస్తున్నారు.

Advertisement
Does Kerala Only Own A Lottery That Is Pouring In Rs. Shouldn't We Buy What Ar

టికెట్లు ఎలా కొనలానే విషయంపై గూగుల్​లో అయితే తెగ వెతికేస్తున్నారు.ఈ నేపథ్యంలో కేరళ లాటరీకి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది.

ప్రస్తుతం అమలులో ఉన్న ఆ రాష్ట్ర లాటరీ రెగ్యులేషన్ చట్టం ప్రకారం కేరళ వెలుపల లాటరీ టికెట్లు విక్రయించడం అనేది పూర్తిగా నిషిద్ధం అని చెప్పుకోవాలి.అయితే ఇతర రాష్ట్రాల ప్రజలు కేరళకు వచ్చి లాటరీలు కొనుక్కొనే వెసులుబాటు కలదు.

ప్రైజ్ మనీ గెలుచుకుంటే సంబంధిత డాక్యుమెంట్లు చూయించి డబ్బు కలెక్ట్ చేసుకోవచ్చు.ఇక లాటరీ రూల్స్ ప్రకారం.

ఆన్​లైన్​లో లాటరీలు కొనడం అనేది చట్టవిరుద్ధం.క్యాష్ ప్రైజ్​ను గెలుచుకునేందుకు భౌతిక టికెట్ ఉండటం తప్పనిసరి.

Does Kerala Only Own A Lottery That Is Pouring In Rs. Shouldnt We Buy What Ar
ఆ ఈవెంట్ లో అవమానం.. నితిన్ సారీ చెప్తాడని వెళ్తే అలా జరిగింది.. హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్!
న్యూస్ రౌండప్ టాప్ 20 

ఈమధ్య కాలంలో ఔత్సాహికులను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో టికెట్లు విక్రయిస్తాం అంటూ కొన్ని వాట్సాప్ గ్రూపులు సైతం వెలిశాయి.వీరిలో ఎవరైనా నిజమైన టికెట్లు అమ్మేవారు ఉన్నా.దీనికి చట్టబద్ధత అంటూ లేదు అని గుర్తు పెట్టుకోవాలి.

Advertisement

ఈ వాట్సాప్ విక్రయాలు అనేవి కేవలం నమ్మకంపైనే ఆధారపడి ఉంటాయి.ప్రైజ్ మనీ కోసం ఇక్కడ కొన్ని రకాల డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది.ముందుగా ఒరిజినల్ లాటరీ టికెట్ఫామ్ నెం.8పై స్టాంప్ వేసిన రసీదుపాస్​పోర్టు సైజ్ ఫొటోలు అతికించి, దానిపై గెజిటెడ్ అధికారి సంతకం చేసిన నోటరీ(రెండు కాపీలు) ఫొటోకాపీలు అతికించి ఉన్న టికెట్ ఉండాలి.అలాగే గుర్తింపు పత్రాలు (పాస్​పోర్ట్/ రేషన్ కార్డు/ ఓటర్ కార్డు/ డ్రైవింగ్ లైసెన్స్/ పాన్ కార్డు) వీటితో పాటు ప్రైజ్ మనీ గెలిచిన వ్యక్తి నుంచి ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

తాజా వార్తలు