TDP: టీడీపీ కేటాయించిన స్థానాలు బీజేపీకి నచ్చలేదా ? 

టిడిపి ,జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) పొత్తులో భాగంగా బిజెపికి 10 అసెంబ్లీ , ఆరు లోక్ సభ స్థానాలను కేటాయించారు.

అయితే బిజెపి నుంచి పోటీ చేసేందుకు చాలామంది కీలక నాయకులే ఆశలు పెట్టుకోవడంతో , మరికొన్ని స్థానాలను తమకు కేటాయించాల్సిందిగా బిజెపి , టిడిపి పై ఒత్తిడి చేస్తుంది.

అయితే అంతకు మించిన స్థానాలను కేటాయించేందుకు టిడిపి ఏమాత్రం ఇష్టపడడం లేదు.అయితే ఇప్పుడు కేటాయించిన సీట్ల విషయంలో బిజెపి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

టిడిపి ఉద్దేశపూర్వకంగానే ఓడిపోయే స్థానాలను బిజెపికి కేటాయించిందనే అనుమానం బీజేపీ నాయకుల్లో వ్యక్తం అవుతోంది. దీనిపై బిజెపి అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం.

తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ( Daggupati Purandheswari )ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.పార్లమెంట్ స్థానాల విషయంలో బిజెపి సంతృప్తికరంగానే ఉన్నా.అసెంబ్లీ సీట్ల విషయంలోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట.

Advertisement

ముఖ్యంగా పాడేరు, అనపర్తి ,ఆదోని ( Paderu, Anaparthi, Adoni )వంటి నియోజకవర్గాలను బిజెపికి కేటాయించారు.కాకపోతే అక్కడ బిజెపికి క్యాడర్ లేకపోవడం, సరైన నాయకత్వం కూడా లేకపోవడంతో ఈ సీట్లలో పోటీ చేసినా ఓటమి తప్పదనే భయం బిజెపి నాయకుల్లో వ్యక్తం అవుతుంది.

ఈ నియోజకవర్గాల్లో టిడిపి పోటీ చేసినా గెలిచే అవకాశం లేకపోవడంతోనే , అవి తమకు కేటాయించారని బిజెపి అనుమానం వ్యక్తం చేస్తోంది.

దీనిపై కొంతమంది రాష్ట్ర నాయకులు బిజెపి అధిష్టానానికి లేఖలు కూడా రాసినట్లు సమాచారం.దీంతో కొన్ని సీట్ల విషయంలో మార్పు చేర్పులు చేపట్టే విధంగా టిడిపి అధిష్టానం పై బిజెపి పెద్దలతో ఒత్తిడి చేయించాలని ఏపీ బీజేపీ నాయకులు భావిస్తున్నారు.ఇక చంద్రబాబు సైతం టిడిపిని, తనను వ్యతిరేకించే బిజెపి నాయకులకు టికెట్ రాకుండా చూడాలి అనే ఆలోచనతో ఉన్నారని , ముఖ్యంగా సోము వీర్రాజు , జీవీ ఎల్ నరసింహం ,విష్ణువర్ధన్ రెడ్డి( Somu Veerraju, GV L Narasimham, Vishnuvardhan Reddy ) వంటి వారికి టికెట్లు దక్కినా వారు గెలవకుండా టిడిపి సహకరించే అవకాశం లేదనే అనుమానం బిజెపి నాయకులలో కలుగుతోంది .అందుకే కొన్ని సీట్ల విషయంలో టిడిపి అధిష్టానం పై బీజేపీ పెద్దలు ఒత్తిడి పెంచే అవకాశం కనిపిస్తోంది.

Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn
Advertisement

తాజా వార్తలు