బ్యాంకు కస్టమర్లకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ( Punjab National Bank )గుడ్ న్యూస్ తెలిపింది.అత్యంత సులువుగా, వేగవంతంగా లోన్ పొందే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
దీని ద్వారా అత్యంత సులభంగా ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా లోన్ ఈజీగా పొందవచ్చు.కేవలం ఓటీపీతోనే లోన్ పొందేలా అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.
దీని ద్వారా లోన్‌కు దరఖాస్తు చేసుకున్న క్షణాల్లోనే మీ అకౌంట్‌లోకి డబ్బులు వచ్చేస్తాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంకుగా నడుస్తోంది.ఈ బ్యాంక్ ఎప్పటినుంచో కొనసాగుతోంది.తాజాగా ఈ బ్యాంక్ కస్టమర్ల కోసం ఎఫ్‌డీ లోన్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది.
ఈ సర్వీసుల ద్వారా ఈజీగా వినియోగదారులు లోన్ పొందవచ్చు.ఫిక్స్ డ్ డిపాజిట్( Fixed Deposits ) చేసినవారికి ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం పంజాబ్ నేషనల్ బ్యాంక్ కల్పిస్తోంది.
దీంతో ఎవరైనా బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే వారికి సులభంగా లోన్ అందిస్తుంది.ఫిక్స్ డ్ డిపాజిట్ చేసినవారు ఎఫ్‌డీ లోన్‌ను పొందవచ్చు.

ఈ ఎఫ్‌డీ లోన్( FD Loan ) పొందటానికి బ్యాంకు బ్రాంచ్‌కి వెళ్లాల్సిన పనిలేదు.ఇంట్లోనే ఉండి ఈజీగా లోన్ పొందవచ్చు.పీఎన్‌బీ వన్ ద్వారా రుణం పొందవచ్చు.పీఎన్‌బీ వన్‌లోకి లాగిన్ అయి సర్వీసెస్ అనేది క్లిక్ చేయాలి.అందులో అకౌంట్లను సెలక్ట్ చేసుకున్న తర్వాత ఓడీ అగెనెస్ట్ ఎఫ్‌డీ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.మీకు అత్యవసంగా డబ్బులు అవసరమైనప్పుడు ఇలా లోన్ పొందవచ్చు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌నే కాకుండా చాలా బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్‌పై లోన్‌ను అందిస్తున్నాయి.దీంతో ఏయే బ్యాంకుల్లో ఆ అవకాశం ఉందో తెలుసుకుని లోన్ పొందవచ్చు.
మీరు డిపాజిట్ చేసే ఫిక్స్ డ్ డిపాజిట్ సొమ్ముపై ఈ లోన్ ను బ్యాంకులు అందిస్తాయి.వీటికి ఎలాంటి పేపర్ ప్రాసెస్ ఉంది.
బ్యాంకుకు చెందిన మొబైల్ అప్లికేషన్లలోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.







