కె ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సౌందర్య, రజనీకాంత్, రమ్యకృష్ణ కలిసిన నటించిన చిత్రం నరసింహ( Narasimha ).
అప్పట్లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.కాగా ఈ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ నటించి మెప్పించింది.
నరసింహా- నీలాంబరి జంట గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు.నరసింహా ప్రేమకోసం నీలాంబరి తన జీవితాన్నే పోగొట్టుకుంటుంది.
ప్రేమను పగగా మార్చుకొని అతడి అంటూ చూడాలనుకొని చివరికి ఆమె అంతం అయిపోతుంది.ఇప్పటికీ నీలాంబరి ప్రేమ గురించి, ఆమె పొగరు గురించి ఎక్కడో ఒకచోట మాట్లాడుకుంటూనే ఉంటారు.
ఇక దాదాపు 25 ఏళ్ళ తరువాత నరసింహా- నీలాంబరి( Narasimha-Neelambari ) ఒక్కటి అయ్యారు.కాదు కాదు తమిళ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఒక్కటి చేశారనీ చెప్పవచ్చు.అవును ఆయన దర్శకత్వం వహించిన జైలర్ సినిమా(Jailer Movie )లో వీరు జంటగా కనిపించబోతున్నారు.రజినీకాంత్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది.ఈ మూవీ ఆగస్టు 10 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.అనగా రేపే ఈ సినిమా విడుదల కానుంది.
ఇందులో రజనీకాంత్ సరసన తమన్నా హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు చిత్ర బృందం
ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు.ఈ ఈవెంట్ లో రజినీకాంత్( Rajinikanth ) సినిమా గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.అంతే కాకుండా రమ్యకృష్ణ( Ramyakrishnan )తో మళ్లీ నటించడంపై కూడా చెప్తూ కామెడీ చేశారు.సెట్ లో నెల్సన్ తమను ఎంత ఇబ్బంది పెట్టాడో సరదాగా చెప్పుకొచ్చారు.25 ఏళ్ళ తరువాత రమ్యకృష్ణతో కలిసి నటిస్తున్నాను.ఒక సీన్ కోసం నెల్సన్ 8 టేకులు తీసుకున్నాడు.ప్రతిసారి అది తక్కువ అయ్యింది.ఇది ఎక్కువ అయ్యింది అంటూ చెప్పుకొస్తూనే ఉన్నాడు.నీలాంబరి ముందు నరసింహా పరువు తీశాడు ఈ నెల్సన్( Nelson Dilip Kumar ) అంటూ నవ్వుతూ తెలిపారు రజినీకాంత్.
ప్రస్తుతం రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.