ఇంద్రజ( Indraja ) టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఒకానొక సమయంలో వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇలా అప్పట్లో ఇతర హీరోయిన్లతో పోటీపడుతూ మంచి సినిమా అవకాశాలను అందుకొని ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నటువంటి ఇంద్రజ కొంతకాల పాటు వెండితెరకు దూరమయ్యారు.
అయితే చాలాకాలం తర్వాత ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.అయితే తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై ప్రారంభించి అనంతరం వెండితెర అవకాశాలను అందుకుంటు బిజీగా ఉన్నారు.

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమానికి అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ( Sridevi Drama Company ) కార్యక్రమానికి ఈమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు.ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా మాత్రమే కాకుండా వెండితెరపై కూడా సినిమా అవకాశాలు అందుకొని యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ వెండి తెర ప్రేక్షకులను కూడా సందడి చేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఈ ఆదివారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ వంటి వారు తమ పంచ్ డైలాగులతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా ఇంద్రజ ఈ కార్యక్రమంలో అద్భుతమైన క్లాసికల్ డాన్స్ వేశారు.అయితే ఈ డాన్స్ చేసిన అనంతరం ఈమె ఒక్కసారిగా గుక్క పట్టి వేదికపైనే ఏడ్చారు.అయితే ఈమె ఇలా ఏడవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే చాలా కాలం తర్వాత ఇలా క్లాసికల్ డాన్స్ వేయగా అందరూ తన డాన్స్ పట్ల ప్రశంసలు కురిపించారు.ఇలా ఒక్కసారిగా తనపై ఈ విధమైనటువంటి ప్రశంసలు రావడంతో సంతోషంతో వేదికపైనే ఏడ్చారు.
ఇన్ని రోజులు నేను ఇంత మిస్ అయ్యానా అంటూ ఈమె ఏడవడంతో అక్కడున్నటువంటి వారు కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు.







