Pestle marriage : పెళ్లిలో రోకలి రోలుకు పూజలు ఎందుకు చేస్తారో తెలుసా..

ప్రపంచవ్యాప్తంగా జరిగే పెళ్లిలలో మహిళలు ఎన్నో రకాల కార్యక్రమాలను, సంప్రదాయాలను చేస్తూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే మన దేశ వ్యాప్తంగా జరిగే ఏ పెళ్లిలో అయినా ఎన్నో రకాల ఆచారాలు, సంప్రదాయాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

అదేవిధంగా ఒక్కొక్క ప్రాంతం ప్రకారం కొన్ని రకాల సంప్రదాయాలు, ఆచారాలు ఎన్నో పద్ధతులు ఉంటాయి.అయితే నేటి సమాజంలో ఇలాంటి సంప్రదాయాన్ని ఒక్కొక్కటిగా వదిలి పెళ్లి కార్యక్రమాలను చేస్తున్నారు.

అయితే చాలా ప్రాంతాలలో ఇప్పటికీ పెళ్లిళ్లలో రోకలి, రోలు తో పాటు తిరగానికి కూడా పూజలు చేస్తూ ఉన్నారు.రోకలి రోలుకు పూజ చేయడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మన పూర్వీకులు ఒక ఇంట్లో పెండ్లి నిశ్చయం జరిగింది అంటే, పెళ్లి చేయడానికి కొన్ని నెలల ముందు నుంచి రోలులో బియ్యం దంచడం, పసుపు దంచడం, అలాగే పెళ్లిలో వంటలకు సరిపడే అన్ని ఆహార పదార్థాలను ముందుగానే దంచి సిద్ధం చేసుకుని ఉంచేవారు.అందుకే ఏ ఇంట్లో ముందుగా రోకలి, రోలు కు పూజ చేసి పెళ్లి పనులను మన పెద్దవారు మొదలు పెట్టేవారు.

Advertisement

అయితే ప్రస్తుత సమాజంలో అన్నీ కూడా కిరాణాలలో రెడీమేడ్ గా దొరకడంతో కొన్నిచోట్ల పెళ్ళికి ఒకరోజు ముందు ఇలా ఈ రోకలి రోలు సాంప్రదాయ పూజలను చేస్తూ ఉన్నారు.ఇంకా చెప్పాలంటే పురాణాల ప్రకారం బాలరాముడు నాగలితో భూమిని దున్ని, పంటను పండించి రోకలితో దంచి ఆహారాన్ని తీసుకోవాలని ఉంది.

రోలు లక్ష్మీదేవి, రోకలి నారాయణుడు, తిరుగలి శివుడు, దాని పిండి పార్వతి అని పూర్వం పెద్దవారు చెప్పేవారు.ఇలా చేసి పనులు అధిష్టాన దేవతలను పూజించడం వల్ల ధన ధాన్యాలతో పాటు ఆ ఇంట్లో సిరి సంపదలు, సుఖ సంతోషాలు వస్తాయని పెద్దలు నమ్ముతారు.అందుకే మనం పూర్వికులు ఏదైనా మంచి కార్యం చేయాలని అనుకుంటే మొదటిగా రోకలి రోలు పూజించేవారని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు