ప్రస్తుతం ఉన్నటువంటి జాతీయ పార్టీలలో కాంగ్రెస్ ( Congress ) అతి పెద్ద పార్టీ.ఇండియాను అత్యధిక పిరియడ్ పాలించింది కూడా ఈ పార్టీయే.
నెహ్రూ కాలం నుంచి మొదలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ వరకు ఈ పార్టీ ఎన్నో సంస్కరణలు, పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చింది.అలాంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
దీనికి ప్రధాన కారణం గల్లి నుంచి ఢిల్లీ వరకు పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం.ఏ మీటింగ్ జరిగిన తప్పనిసరిగా నేతల మధ్య ఎడమొహం, పెడ మొహం అనేది ఉంటుంది.
అలా తప్పులు చేస్తూ కాంగ్రెస్ రోజు రోజుకు చతికిల పడుతూ వస్తోంది.ఇదే తరుణంలో రాహుల్ గాంధీ ( Rahul gandhi ) భారత్ జోడోయాత్ర పేరుతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి కాస్త ఊపు తీసుకొచ్చారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రతి రాష్ట్రంలో గెలుపు తీరాలకు దగ్గరగా వెళుతుంది.ఇదే తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ( Revanth reddy ) అయిన తర్వాత కాస్త పుంజుకుందని చెప్పవచ్చు.బీఆర్ఎస్ కు దీటైన పార్టీ కాంగ్రెస్సే అని చెప్పకనే చెప్పవచ్చు.అలాంటి కాంగ్రెస్ ను రాబోవు ఎలక్షన్స్ లో ఎలాగైనా గెలిపించాలని పార్టీ నేతలంతా ఒక్కతాటిపైకి వస్తూ ముందుకు వెళ్తున్నారు.
పైన పటారం లోన లోటారం అనే విధంగా మనసులో ఎంతో కోపమున్న బయటకు మాత్రం అందరం కలిసి ఉన్నామని మెసేజ్ ఇస్తున్నారు.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ లైన ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Komatireddy Venkatareddy ) , దామోదర రాజనర్సింహ, బట్టి విక్రమార్క వంటి నాయకులు ఎందరో ఉన్నారు.
ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి ఎవరు అనేది ఇప్పటికి కూడా క్లారిటీ రావడం లేదు.

రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు ఇస్తేనే ఇన్ని గొడవలు పెడుతున్న ఈ సీనియర్ నాయకులు ఆయనను సీఎం చేస్తే ఊరుకుంటారా.? గందరకోలం క్రియేట్ చేస్తారా.? అనేది ప్రశ్నార్థకంగా మారింది.ఒకవేళ అధిష్టానం నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే ఉత్తంకుమార్ రెడ్డి( Uttam kumar reddy ) , కానీ బట్టి విక్రమార్క, కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ తిరుగుబాటు బాగుటా ఎగరవేస్తారని ప్రజలు భావిస్తున్నారు.ఈ తరుణంలో సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైన అనిచ్చితి నెలకొందని చెప్పవచ్చు.








