Balakrishna Legend : బాలయ్య లెజెండ్ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

నందమూరి నటసింహం గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న బాలయ్య బాబు, బోయపాటి కాంబినేషన్ లో చేసిన సింహ సినిమా సూపర్ హిట్ ను అందుకుంది.

ఇక వీళ్లిద్దరూ కలిసి రెండో ప్రయత్నంగా చేసిన లెజెండ్ సినిమా( Legend ) కూడా బ్లాక్ బాస్టర్ హిట్ ని సొంతం చేసుకోవడమే కాకుండా బాలయ్య బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాలో రాధిక ఆప్టే( Radhika Apte ) హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.అయితే మొదట బోయపాటి ఈ సినిమాలో త్రిష ను హీరోయిన్ గా తీసుకుందామనుకున్నాడట.

కానీ అప్పుడు త్రిష కొన్ని తమిళ్ సినిమాలకి కమిట్ అయి ఉండటం వల్ల ఈ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది.

ఇక దానివల్ల ఈ క్యారెక్టర్ లోకి రక్త చరిత్ర సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న రాధిక ఆప్టే ను తీసుకున్నాడు.ఇక ఆమె పోషించిన పాత్ర కూడా ఆ సినిమాకు చాలా బాగా సెట్ అయింది.ఇక ఈ సినిమా సక్సెస్ లో ఆమె కూడా కీలకపాత్ర వహించిందనే చెప్పాలి.

Advertisement

ఈ సినిమా కనక త్రిషకి పడి ఉంటే ఆమె ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు వచ్చేదని చాలామంది అభిమానులు అప్పట్లో విపరీతంగా కామెంట్స్ అయితే చేశారు.

ఇక ఆ తర్వాత బాలయ్య బాబు తో లయన్ సినిమా( Lion )తో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది.ఇక మొత్తానికైతే బాలయ్య బాబు రాధిక ఆప్టే కి ఒక మంచి సక్సెస్ అందించాడనే చెప్పాలి.ఇక ప్రస్తుతం బాలయ్య బాబు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే వరుసగా నాల్గోవ సక్సెస్ కొట్టిన సీనియర్ హీరోగా గుర్తింపు పొందుతాడు.

Advertisement

తాజా వార్తలు