మార్గశిర మాసం విశిష్టత ఏమిటో తెలుసా!

కార్తీక మాసం అమావాస్య ముగించుకున్న తర్వాత తెలుగు నెలలో 9వ నెలగా ప్రారంభమైంనది మార్గశిర మాసం.

కార్తీక మాసం అంతా ఆ పరమశివునికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అందించాము.

కార్తీకమాసం శివుడికి ఎంత పవిత్రమైనదో, మార్గశిర మాసం విష్ణుమూర్తికి అంతే పవిత్రమైనదిగా భావించి ప్రత్యేక పూజలతో పూజిస్తారు.ఎంతో పవిత్రమైన ఈ మార్గశిర నెలలో మార్గశిర పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం ఉండటం వల్ల ఈ నెలకు మార్గశిర అనే పేరు వచ్చింది.

సాక్షాత్తు విష్ణు భగవానుడు మార్గశిరం అంటే నేనే అని స్వయంగా భగవద్గీతలో తెలియజేశాడు.మృగశిరా నక్షత్రంతో కూడి మార్గశిర మాసంలోకి ప్రవేశించడం వల్ల ఈనెల అందు ఎక్కువ చలి ప్రారంభమయ్యే ఈ నెల అని చెప్పవచ్చు.ఆ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఈ మార్గశిర మాసంలో పూజలు నిర్వహించడానికి ఉపాసన కాలం ఎంత ఉత్తమమైనదిగా చెప్పవచ్చు.

ఉత్తమమైనవి అనగా పక్షులలో గరుత్మంతుడు, మృగాలలో సింహము, నెలలో మార్గశిర మాసం,వేదాలలో సామవేదం ఎంతో ఉత్తమమైనదని భగవద్గీతలో సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే తెలిపారు.ఇంతటి పవిత్రమైన మార్గశిర మాసంలో చేసేటటువంటి ఏ పూజ అయినా, ఏ అభిషేకాలు అయినా, ఏ హోమ మైన తానే స్వీకరిస్తానని ఆ విష్ణుభగవానుడు తెలియజేశాడు.

Advertisement

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రునికి ఉచ్చ స్థానం వృషభ రాశి మృగశిర నక్షత్రం కావటంవల్ల మనం ఎటువంటి కార్యక్రమాలు చేయాలని తలపెట్టిన ఆ చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి ఆ కార్యాలను నిర్వహిస్తారు.ఈ మార్గశిర మాసంలో వేకువజామున నిద్రలేచి తన ఇంటిని శుభ్రపరచుకుని విష్ణు ఆరాధన, పాశురాలను చదవడం, దానధర్మాలు చేయడం అత్యంత శ్రేష్టమైనది.

ఈ నెలలో స్వామివారికి భక్తితో సమర్పించే ప్రతి ఒకటి స్వీకరించే మాసం ఇది అని చెప్పవచ్చు.అంతేకాకుండా ముక్కోటి ఏకాదశి, దత్తాత్రేయ జయంతి వంటి పవిత్రమైన పండుగలను ఈ మాసంలో జరుపుకుంటారు.

Advertisement

తాజా వార్తలు