దత్తాత్రేయ రూప సంకేతార్థం ఏమిటో తెలుసా?

మూడు తలలు.ఆరు భుజాలతో, శంఖ, చక్ర, త్రిశూలాది ఆయుధాలతో.

వెంట నాలుగు కుక్కులు, ఆవుతో దర్శనీయుడైన దత్తాత్రేయుని గురించి అందరికీ తెలుసు.అయితే ఆయన స్వరూపం వనుక ఉన్న సంకేతార్థం గురించి మాత్రం చాలా మందికి తెలియదు.

అయితే దత్తాత్రేయుడి రూప సంకేతార్థం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.మూడు తలలు.

ఆరు చేతులు త్రిమూర్తి సంకేతాలు.బ్రహ్మ, విష్ణు, శివాత్మక తేజ స్వరూపం దత్త స్వరూపం కింద రెండు చేతుల్లో ధరించిన అక్షమాల, కమండలం బ్రహ్మత్వానికి మధ్య చేతుల్లోని డమరుకం, త్రిశూలం శివత్వానికి, పై రెండు చేతుల్లోని శంఖ చక్రాలు విష్ణు తత్వానికి ప్రతీకలు.

Advertisement

అంతే కాకుండా త్రిశూలం మనలోని త్రిగుణాలను నాశనం చేసి గుణాతీతుడిగా చేస్తుందని.శంఖ (ఓంకార) నాదం సృష్టి కార్యాన్ని నిర్వహించి జగత్తును అజ్ఞానం నుంచి మేల్కొలుపుతుందని, కమండలం చిత్తాన్ని శుద్ధి చేసుకోమని ప్రభోదిస్తుందని చక్రం అవిద్యను లయింప చేస్తుందని భావించబడుతోంది.

అలాగే ఆయన వెంట ఉండే గోవు కామధేనువుకు సంకేతమని.దాని దుగు నుంచి చతుర్విధ పురుషార్థాలనే క్షీరాన్ని దత్తోపాసనకులకు అందిస్తాడని పురాణ ప్రతీతి.

అంతే కాకుండా తనను శరణు కోరిన యమ ధర్మరాజును గోవుగా తన చెంతు ఉంచుకొని రక్షిస్తున్నాడని, ఆ ధర్మ దేవతను నాలుగు ప్రక్కల నుంచి నాలుగు వేదాలు, నాలుగు శునక రూపాలతో కాపాడుతూ దత్త స్వామి ఆదేశానువర్తులై ఉన్నాయని మపు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.అయితే దత్తాత్రేయుడి స్వరూపంలోని అంతరార్థం ఇదేనని కూడా భక్తులంతా నమ్ముతున్నారు.

అందుకే ఆ స్వామి వారిని భక్తి, శ్రద్ధలతో కొలుస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్11, శుక్రవారం 2025
Advertisement

తాజా వార్తలు