ఉదయం పూట తినదగిన ఉత్తమ పండ్లు ఏవేవో తెలుసా?

సాధారణంగా ఉదయం వేళలో పండ్లు తినకూడదని చాలా మంది భావిస్తుంటారు.కానీ అది అన్ని పండ్లకు వర్తించదు.

నిజానికి ఉదయం పూట తినదగిన ఉత్తమ పండ్లు కూడా కొన్ని ఉన్నాయి.మరి ఆ పండ్లు ఏంటి.

‌.? ఉదయం వేళలో వాటిని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి.? వంటి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.బొప్పాయి( papaya ) .మార్నింగ్ సమయంలో తినదగిన బెస్ట్ ఫ్రూట్ ఇది.బొప్పాయిలో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.మన శరీరానికి అవసరమయ్యే మరెన్నో పోషకాలు బొప్పాయిలో నిండి ఉంటాయి.

ఉదయం పూట ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలు తింటే ఎక్కువ సమయం పాటు శక్తివంతంగా ఉంటారు.నీరసం, అలసట వంటివి వేధించకుండా ఉంటాయి.పైగా బొప్పాయి రక్తహీనతను తరిమి కొడుతుంది.

Advertisement

అలాగే ఉదయం పూట మీరు తినాలి అనుకుంటే అరటి పండును( Banana ) తినవచ్చు.అరటి పండు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.మరియు అరటిపండు బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

ఒత్తిడిని దూరం చేసి మెదడును చురుగ్గా మారుస్తుంది.మార్నింగ్ టైంలో మీరు పుచ్చకాయను తీసుకోవచ్చు.

బిజీ లైఫ్ స్టైల్ కారణంగా ఎక్కువ శాతం మంది బాడీకి అవసరమయ్యే వాటర్ ను అందించడంలో విఫలం అవుతుంటారు.

అందువ‌ల్ల‌ ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో పుచ్చకాయ ముక్కలను( Watermelon slices ) తీసుకుంటే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.పైగా పుచ్చకాయ మైండ్ మరియు బాడీని రిఫ్రెష్ చేస్తుంది.పని పై ఏకాగ్రతను పెంచుతుంది.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

ఇక ఉదయం పూట యాపిల్ పండును( apple fruit ) కూడా తినొచ్చు.పోషకాలకు పవర్ హౌస్ అయిన యాపిల్ ను ఉదయం పూట తీసుకుంటే.

Advertisement

రోజంతా చాలా చురుగ్గా ఉంటారు.జీర్ణక్రియ యాక్టివ్ గా పని చేస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.రక్తపోటు సైతం అదుపులో ఉంటుంది.

తాజా వార్తలు