మీకు ఈ టెలిగ్రామ్‌ ట్రిక్స్‌ తెలుసా?

టెలిగ్రామ్‌ సందేశాలను సత్వరంగా, ఉచితంగా పంపే ఓ వేదిక.అయితే, ఇందులో ఉండే కొన్ని ట్రిక్స్‌ మీకు తెలియకపోవచ్చు.

 Do You Know These Telegram Features , New Futures , Telegram , Edit Messges , Si-TeluguStop.com

ఆ వివరాలు తెలుసుకుందాం.టెలిగ్రామ్‌కు ఇప్పటికే 500 మిలియన్‌ ఆండ్రాయిడ్‌ కస్టమర్స్‌ ఉన్నారు.

ఎడిట్‌ మెసేజెస్‌

టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా మీరు పంపించిన సందేశాలను ఎడిట్‌ చేసే అవకాశం ఉంటుంది.దీనికి ఆ సందేశాన్ని సెలెక్ట్‌ చేసి, ఎడిట్‌ (పెన్‌) ఐకాన్‌ను ఎంచుకోవాలి.

అప్పుడు వెంటనే మీ ఎడిటెడ్‌ మెసేజెస్‌ కనిపిస్తాయి.కేవలం 48 గంటల్లోపు పంపించిన సందేశాలను మాత్రమే ఎడిట్‌ చేసే అవకాశం ఉంటుంది.

Telugu Edit Messges, Kwick Jip, Masseges, App, Edit, Editer-Latest News - Telugu

సైలెంట్‌ మెసేజేస్‌.

ఒకవేళ మీరు సందేశం పంపించాల్సిన వ్యక్తి బిజీగా ఉంటే, మీరు తప్పకుండా మెసేజ్‌ పంపించాలంటే సైలెంట్‌ మెసేజెస్‌ ఫీచర్‌ ద్వారా పంపించవచ్చు.అప్పుడు ఆ వ్యక్తికి శబ్దం కలుగకుండా వైబ్రేట్‌ కూడా అవ్వకుండా చేరుతుంది.దీనికి రిసీపియంట్‌ ‘డూ నాట్‌ డిస్ట్రబ్‌ మోడ్‌’ ఆన్‌ చేయకున్నా మెసేజ్‌ ట్యాప్‌ చేసి, సెండ్‌ బటన్‌ను హోల్డ్‌ చేస్తే సరిపోతుంది.ఆ తర్వాత ‘సెండ్‌ వితౌట్‌ సౌండ్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

షెడ్యూల్‌ మెసేజెస్‌

టెలిగ్రామ్‌లో మెసేజెస్‌ను మీకు కావాల్సినపుడు షెడ్యూల్‌ చేయవచ్చు.దీనికి ఆ మెసేజ్‌పై ప్రెస్‌ చేసి, సెండ్‌ బటన్‌ను హోల్డ్‌ చేయాలి.ఆ తర్వాత షెడ్యూల్‌ మెసేజ్‌ఆప్షన్‌ను ఎంచుకుని డేట్‌ అండ్‌ టైంను సెలెక్ట్‌ చేయాలి.మీరు షెడ్యూల్‌ చేసిన సమయానికి ఆ మెసేజ్‌ చేరిపోతుంది.

Telugu Edit Messges, Kwick Jip, Masseges, App, Edit, Editer-Latest News - Telugu

మీరు పంపించిన మీడియా, ఫోటోలను మీరే డిలీట్‌ చేయవచ్చు.దీనికి సదరు వీడియో లేదా పోటోను ఎంచుకుని ‘టైమర్‌’ బటన్‌పై క్లిక్‌ చేయాలి.తొలగించాల్సిన సమయాన్ని మీరు ఎంచుకునే అవకాశం ఉంటుంది.

మెసేజెస్‌ డిలీట్‌ చేయవచ్చు

టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా మీకు ఎవరైనా మెసేజ్‌ పంపినవే కాకుండా, మీరు పంపించిన సందేశాలను కూడా డిలీట్‌ చేయవచ్చు.

వీడియో ఎడిట్‌

మీరు ఎవరికైనా వీడియోలు పంపించాలనుకుంటే వాటిని సులభంగా ఎడిట్‌ చేసుకోవచ్చు. వీడియో సెలెక్ట్‌ చేసి, ట్యూనింగ్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేస్తే న్యూ వీడియో ఎడిటర్‌ ఓపెన్‌ అవుతుంది.వీటికి అదనపు మెరుగులు దిద్దడానికి కాంట్రాస్ట్, ఎక్స్‌పోజర్, సాచురేషన్‌ వంటివి ఉపయోంగించవచ్చు.

క్విక్‌ జిఫ్, యూట్యూబ్‌ సెర్చ్‌

ఏదైనా జిఫ్‌ లేదా యూట్యూబ్‌ లింక్‌ను టెలిగ్రాం యాప్‌ మూసివేయకుండానే పంపించవచ్చు.దీనికి ః జజీజ లేదా యూట్యూబ్‌ అని ఎంటర్‌ చేస్తే సరిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube