పనీర్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

పనీర్ ( Paneer )భారతీయుల ప్రతి వంటకాలలో కూడా ఒక రుచికరమైన వంటకం అని చెప్పాలి.

మటన్ పనీర్, బటర్ పనీర్, పనీర్ పరోటా, పనీర్ టిక్కా, ఎక్కడైనా పనీర్ ఇలా ఎన్నో రకాల పనీర్ వంటకాలను భారతీయులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

అయితే పనీర్ ప్రోటీన్, విటమిన్లు ఖనిజాల అద్భుతమైన మూలం.పనీర్ వినియోగం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

అయితే పనీర్ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.పనీర్ శరీరం సరైన పని తీరుకు అవసరమైన తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను( Amino acids ) కలిగి ఉంటుంది.

అయితే ఇతర చీజ్ లతో పోలిస్తే ఇది చాలా ఆరోగ్యకరమైనది.

Advertisement

క్రమం తప్పకుండా పనీర్ ఆహారంలో చేర్చుకోవచ్చు.పనీర్ అనేది తక్కువ కార్బో, అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం కావడం వలన ఇది బరువు తగ్గడంలో మీకు బాగా సహాయపడుతుంది.పనీర్ తీసుకుంటే కడుపు నిండుగా కూడా ఉంటుంది.

పనీర్ శాఖాహారులకు ప్రోటీన్ ఒక అద్భుతమైన మూలమని చెప్పాలి.దీన్ని తీసుకోవడం వలన కండరాల పెరుగుదల, మరమ్మత్తు కోసం అవసరమైన అధిక నాణ్యత ప్రోటీన్ను ఇది కలిగి ఉంటుంది.

అలాగే ఇది బాడీ బిల్డర్లు, అట్లేట్లకు మంచి ఆహారం.పనీర్ నిత్యం తీసుకుంటే ఇన్సులిన్ ( Insulin )ఉత్పత్తికి సహాయపడుతుంది.

ఎందుకంటే పనీర్ లో ట్రిప్లోపాన్ ( Triplopon )అనే అమైనో ఆమ్లం అధికంగా ఉంటుంది.

నాగచైతన్య శోభిత ధూళిపాళ మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్.. ఎన్ని సంవత్సరాలంటే?
ఆ పదవుల విషయంలో పోటా పోటీ .. బాబుని పవన్ ఒప్పిస్తారా ? 

ఇది రక్తంలోని చక్కెర స్థాయిని నివారిస్తుంది.పనీర్ ను తీసుకోవడం వలన ఎముకలు, దంతాల ఆరోగ్యం చాలా బాగుంటుంది.ఎముకల, దంతాల పెరుగుదల నిర్వహణకు పనీర్ ఎన్నో అవసరమైన పోషకాలని అందిస్తుంది.

Advertisement

పనీర్ తో పాటు క్యాల్షియం ఎక్కువగా ఉండే ఇతర ఆహారం కూడా చేర్చుకోవడం మంచిది.పనీర్ లో ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వలన ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

తరచూ ఆహారంలో దీన్ని చేర్చుకుంటే జలుబు, ఫ్లూ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.పనీర్ ను తీసుకోవడం వలన మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

తాజా వార్తలు