ఉసిరికాయ తినడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏవో తెలుసా..

శీతాకాలంలో ఉష్ణోగ్రత కారణంగా శరీర జీవక్రియ రేటు మందగించి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి లోపిస్తుంది.దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

అయితే అలసట, నీరసం, చికాకు, ఒళ్ళు నొప్పులు లాంటి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.అంతేకాకుండా బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు మన ఇమ్యూనిటీ సిస్టమ్ పై దాడి చేస్తాయి.

దీంతో మన ఆరోగ్యం క్షీణిస్తుంది.అయితే మనం వీటిని ఎదుర్కోవడానికి రోజువారి ఆహారంలో ఇమ్యూనిటీ శక్తిని పెంపొందించే విటమిన్ సీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా లభించే ఆహారాన్ని తీసుకుంటే చాలా మంచిది అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అయితే అతి ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువగా లభించే ఉసిరికాయలను తరచూ ఆహారంలో తింటే గాని ఆరోగ్య ప్రయోజనాలు మనం సొంతం చేసుకోవచ్చు.అయితే ఉసిరికాయలు సమృద్ధిగా విటమిన్ సి, విటమిన్ ఏ ఫైబర్, కాల్షియం, పొటాషియం, యాక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

Advertisement

అందుకే సీజన్ ప్రకారంగా వచ్చే ప్రతి ఇన్ఫెక్షన్, అలర్జీలను కూడా నియంత్రించే గుణం ఈ ఉసిరికాయలో సమృద్ధిగా లభిస్తుంది.అందుకే మనం రోజు తినే ఆహారంలో ఉసిరికాయను చేర్చుకుంటే చాలా మంచిది.

అయితే సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, ఆరెంజ్ పండ్లలో కంటే ఉసిరిలో ఎక్కువగా విటమిన్ సి లభిస్తుంది.అదేవిధంగా ఉసిరికాయను తింటే అందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

మలబద్ధకం, అజీర్తి లాంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.అలాగే ఉసిరి లో ఉండే విటమిన్ ఏ అండ్ ఆక్సిడెంట్ మన కంటి చూపును మెరుగుపరుస్తోంది.

ఉసిరి లో ఎక్కువగా లభించే ఫైబర్, క్రోమియం, ఇన్సులిన్ ఉత్పత్తిని అధికం చేసి మన శరీరానికి కావాల్సిన గ్లూకోస్ స్థాయిని ఉత్పత్తి చేసి రక్తంలో ఉన్న గ్లూకోస్ స్థాయిలను నియంత్రిస్తుంది.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

అలాగే అధిక బరువుతో బాధపడుతున్న వారికి కూడా ఉసిరి కషాయం చాలా సహాయపడుతుంది.ఎందుకంటే ఉసిరికాయలు తినడం వల్ల శరీరంలో మలినాలు తొలగి సహజ పద్ధతిలో శరీర బరువు చాలా సులువుగా తగ్గిపోతుంది.అలాగే శీతాకాలం లో ఎక్కువగా ఇబ్బందికరంగా ఉండే యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.

Advertisement

తాజా వార్తలు