టాలీవుడ్ ( Tollywood )పాన్ ఇండియా హీరో ప్రభాస్( Hero Prabhas ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు.
ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇది ఇలా ఉంటే ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం సలార్( Salar ).డిసెంబర్ 22న భారీ అంచనాల నడుమ విడుదల ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.దీంతో చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా నమోదు అయింది.
సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్‌కు ఈ సినిమా ఉపశమనాన్ని కలిగించింది.ఇకపోతే ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత తన రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేసిన విషయం తెలిసిందే.

వందల కోట్లలో రెమ్యూనరేషన్ ( Remuneration in hundreds of crores )ను అందుకుంటున్నాడు ప్రభాస్.బాహుబలి సినిమా తర్వాత పారితోషికం పెరిగిపోవడంతో ఆయన నికర ఆస్తుల విలువ కూడా భారీగా పెరిగింది.అంతర్జాతీయ సంస్థ ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ప్రభాస్ నికర ఆస్తుల విలువ 145 కోట్లు.2015 వరకు ఆయన మూడుసార్లు ఫోర్బ్స్ టాప్ 100 జాబితాలో చేరారు.ప్రభాస్ ఆస్తుల విలువను ఫోర్బ్స్ అంచనా కడుతూ.హైదరాబాద్‌లోని తన ఇంటి విలువ 60 కోట్ల రూపాయలుగా పేర్కొన్నది.ఆ ఇంటిని విలాసవంతంగా మార్చడానికి స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇతర సౌకర్యాల కోసం సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు సమాచారం.ఇక ముంబైలోని ఫ్లాట్ విలువ 10 కోట్లు అని వెల్లడించింది.
ఇక ప్రభాస్‌కు హైదరాబాద్, ఏపీలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆస్తులు ఉన్నాయి.

ఇటలీలోని ఆయన ఇంటికి కోట్ల రూపాయలు విలువ ఉంది.ప్రతీ నెల ఆ ఇంటికి 40 లక్షల రూపాయల అద్దె కూడా లభిస్తోందట.ఇక భీమవరం, ఇతర ప్రాంతాల్లో కూడా భారీగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు.ఆయన వద్ద కోటి రూపాయల విలువైన ఒక రేంజ్ రోవర్ కారు కూడా ఉంది.60 లక్షల విలువైన ఆడీ కారు, 2 కోట్ల రూపాయల బీఎండబ్ల్యూ 7 సిరీస్, 2 కోట్ల విలువైన మెర్సెడెంజ్ బెంజ్ ఎస్ క్లాస్ కారు, 1 కోటి విలువైన జాగ్వర్ కారు, 8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంథమ్ కారు కూడా ఉంది.అలా ప్రభాస్ నికర ఆస్తుల విలువ 30 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 250 కోట్ల రూపాయలు అని సమాచారం.







