పళని సుబ్రహ్మణ్య స్వామి పురాణ గాథ గురించి మీకు తెలుసా?

పళని అరుగు ముగు శ్రీ దండాయుధపాణి క్షేత్రం అత్యంత పేరు పొందిన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో మూడోదిగా పేరొందింది.

ఈ క్షేత్రం తమిళనాడులోని దిండుగల్ జిల్లాలోని పళనిలో కొలువై ఉంది.

ఇది మధురైకి వంద కిలో మీటర్ల దూరంలో ఉంది.ఎత్తైన కొండలపై ఉంటుంది.

ఒకసారి నారదుడు కైలాసాన్ని దర్శించి దర్శించి శివ పార్వతులకు జ్ఞాన ఫలాన్ని అందిస్తాడు.అది వారిద్దరి కుమారుల్లో ఎవరో ఒకరికి అందించమని చెబుతాడు.

అయితే ఆ ఫలాన్ని అందుకునే అర్హత ఎవరికి ఉందో తెలుసుకోవడానికి కుమారులిద్దరినీ ముల్లోకాలను తిరిగి రమ్మని వారు చెబుతారు.వెంటనే కుమార స్వామి తన నెమలి వాహనం తీసుకొని లోకాల ప్రదక్షిణలకు వెళ్తాడు.

Advertisement

కానీ కార్తికేయ ఎక్కడికి వెళ్లినా అక్కడ ముందుగానే వినాయకుడు దర్శనం ఇస్తాడు.తిరిగి కైలాసాన్ని చేరుకొని జరిగిన విషయం తెలుసుకుంటాడు.

వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ముల్లోకాల ప్రదక్షిణ పూర్తి చేశాడని తెలుసుకొని, నిరాశగా స్కందుడు భూలోకంలోని పళని ప్రదేశానికి చేరుకుంటాడు.కార్తికేయుడు చిన్న బుచ్చుకున్న గౌరీ శంకరులు అక్కడకు చేరుకుంటారు.

పరమ శిలుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని ఊరడిస్తాడు.అప్పుడు శివుడు కమారా.

సకల జ్ఞానాలకు నీవే ఫలానివి అని బుజ్జగిస్తాడు.సకల జ్ఞాన ఫలం అంటే తమిళంలో పళం, నీవు అంటే నీ రెండు కలిపి పళని అయ్యింది.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి27, సోమవారం 2025

అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతగా ఈ కొండ మీదే కొలువు ఉంటానని తల్లిదండ్రులకు చెబుతాడు.అందుకు సరేనన్న శివ పార్వతులు కైలాసానికి తిరిగి వెళ్తారు.

Advertisement

స్వామి వారి విగ్రహాన్ని అత్యంత విషపూరితమైన నవపాషాణాలతో కైలాసానికి తిరిగి వెళ్తారు.పూర్వ కాలంలో ఇక్కడ పళని స్వామి దేవతా మూర్తి తొడ భాగం నుంచి విభూతి తీసి భక్తులకు పంచేవారు.

అలా చేస్తూ ఉండటం వల్ల స్వామి వారి విగ్రహం అరిగిపోతూ వచ్చింది.దీంతో కొద్దికాలం తర్వాత లా పంచడాన్ని నిలిపేశారు.

మొదటగా స్వామి వారి ఆలయాన్ని ఏడో శతాబ్దంలో కేరళ రాజు చీమన్ పెరుమాళ్ నిర్మించారు.తర్వాత పాండ్యులు పుమరుద్ధరించారు.

తాజా వార్తలు