మగధీర సినిమాలో సలోని ఏ పాత్రలో కనిపించిందో తెలుసా..?

దర్శకధీరుడు రాజమౌళి( Rajamouli ) తీసిన సినిమాల్లో అన్ని సూపర్ హిట్ సినిమాలు ఉండటం అనే విషయాన్నీ మనం అబ్జార్వ్ చేస్తే నిజంగా ఆయన ఎంత కష్టపడతాడు అనే విషయం కూడా మనకు అర్థమైపోతుంది.

రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమా కి సంభందించి నాటు నాటు అనే పాటకి ఆస్కార్ అవార్డు( Oscar Award ) వచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఇక మిగితా విషయాలని పక్కన పెడితే రాజమౌళి రామ్ చరణ్ తో తీసిన మగధీర సినిమా( Magadheera ) లో హీరోయిన్ సలోని నటించింది అన్న విషయం మీకు తెలుసా.అయితే ఆమె ఏ క్యారెక్టర్ లో నటించింది అంటే శ్రీహరి పోషించిన సాల్మన్ అనే పాత్రకి లవర్ గా నటించింది ఆమె స్క్రీన్ మీద కనిపించింది చాలా తక్కువ టైం మాత్రమే, ఆ తరువాత రాజమౌళి డైరెక్షన్ లో సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న సినిమాలో హీరోయిన్ గా సలోని( Saloni ) నటించి మంచి పేరు తెచ్చుకుంది.

అయితే ఎలాగో మర్యాద రామన్న సినిమాలో నటిస్తుంది కాబట్టి మగధీర లో కూడా ఒక చిన్న పాత్ర కోసం రాజమౌళి ఆమెని తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

అయితే మర్యాద రామన్న సినిమా తరువాత ఆమె చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ ఆమెకి ఏ సినిమా కూడా అనుకున్న విజయాన్ని ఇవ్వలేదనే చెప్పాలి.దాంతో ఆమె కొన్ని సినిమాల్లో నటించి ఇక అవకాశాలు లేక ఫేడ్ అవుట్ అయిపోయారు అనే చెప్పాలి.ఆమె చేసిన ప్రతి సినిమాలో కూడా ఆమె పాజిటివ్ క్యారెక్టర్ చేస్తూ వచ్చింది నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే ఆవిడకి నచ్చేవి కాదట.

Advertisement

అయితే ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారని తెలుస్తుంది.అందుకే ఆమె ఈ మధ్య ఆమెకి సన్నిహితంగా ఉండే డైరెక్టర్లందరికి కూడా ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ ఉంటె చెప్పండి చేస్తాను అని చెప్పారట.ఆమె చివరగా చేసిన మంచి సినిమా ఏది అంటే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన రేసుగుర్రం సినిమా.

ఈ సినిమాలో ఆమె కిక్ శ్యామ్ కి లవర్ గా చేసి మంచి మార్కులు సంపాదించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు