విరాట్ కోహ్లీ తినే బియ్యం కిలో ఎంతుంటుందో తెలుసా?

విరాట్ కోహ్లీ( Virat Kohli )… ఈ పేరు గురించి ప్రత్యేకంగా ఇక్కడ మెన్షన్ చేయాల్సిన పనిలేదు.ఈ టీమిండియా ఆటగాడంటే అభిమానులు పడి చస్తారు.

 Do You Know How Much Rice Is Eaten By Virat Kohli , Eating, Food, Rice, Kilo, To-TeluguStop.com

తన ఆటతీరుతో పాటు కోహ్లీ ఫిట్ నెస్ అంటే అభిమానులకి చాలా ఆసక్తి.కోహ్లీ ఫిట్ నెస్ కోసం చాలా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాడు.

ఏది పడితే అది తినకుండా ఫుడ్ విషయంలో చాలా కంట్రోల్ ఉంటాడు.అదే విషయంలో ఏం తినాలో, ఏం తినకూడదో అన్న విషయాలపై చాలా అవగాహన కలిగి ఉంటాడు.

ఉదయాన్నే 3 గుడ్లు ఆరగించడంతో కోహ్లీ రోజు మొదలవుతుంది.

విరాట్ కోహ్లీ ఎక్కువగా పెరుగు, పాల ఉత్పత్తులు, గోధుమ పిండి చపాతీలు వంటివి అస్సలు ముట్టుకోడు.మరీ ముఖ్యంగా కార్బోహైడ్రేట్లను( Carbohydrates ) కలిగి వున్న ఆహారం ఎక్కువగా తీసుకోడు.వివిధ పదార్థాలతో చేసిన బ్రెడ్ మాత్రమే తింటాడు.

సాధారణ అన్నం కాకుండా స్పెషల్ రైస్ తింటారు.ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఈ బియ్యాన్ని ప్రత్యేక పద్ధతిలో తయారు చేయడం జరుగుతుంది.

గ్లూటెన్ రహితంగా ,కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఈ బియ్యం సాధారణ రుచిని కలిగి ఉంటుంది.ఈ బియ్యం కిలో ధర రూ.400 నుంచి 500 వరకు ఉంటుంది.

అంటే కోహ్లీ వాడుతున్న కిలో బియ్యం రేటుతో మనం ఓ పది, పదిహేను కేజీల బియ్యం కొనుక్కోవచ్చు.ఫిట్ నెస్ అంటే కోహ్లీ పడి చస్తాడు.స్వీట్స్ అయితే అస్సలు ముట్టని ముట్టడు.34 ఏళ్ల వయసులో కూడా కోహ్లి చాలా ఫిట్‌గా, బాగానే మెంటైన్ చేస్తున్నాడు అంటే అది అతని క్రమశిక్షణకు అడ్డం పడుతుంది.తాను ఏమి తినాలనుకుంటున్నాడో తనకు ఖచ్చితంగా తెలుసు కాబట్టే మన క్రికెటర్ ఒక హీరో మాదిరి ఉంటాడు.

ఇక కోహ్లికి చాలా ఇష్టమైన ఫుడ్స్‌లో చోలే బట్టర్ ఒకటి.అయితే తన ఆటపై, తన ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి పెట్టిన కోహ్లి.చోలే బట్టర్( Chole butter ) తినడం కూడా తగ్గించినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube