వెడ్డింగ్ ఈవెంట్ కోసం సల్మాన్ ఖాన్‌, షారుక్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్న వారిలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి వారు ఉన్నారు.

ఈ హీరోలు పలు సినిమాల్లో నటిస్తూ భారీస్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేసే ఈ స్టార్ హీరోలు ప్రైవేట్ ఈవెంట్ లో కూడా సందడి చేస్తూ భారీగా డబ్బు సంపాదిస్తున్నారని తెలుస్తోంది.ముఖ్యంగా వెడ్డింగ్ ఈవెంట్ లలోఈ హీరోలు సందడి చేస్తూ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటారని బాలీవుడ్ సమాచారం.

ఈ క్రమంలోనే గత వారం రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఒక ప్రవేట్ వెడ్డింగ్ ఈవెంట్ లో భాగంగా సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ సందడి చేశారు.ఈ ఈవెంట్ కోసం ఈ ఇద్దరు హీరోలు భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని బిటౌన్ సమాచారం.

ఈ వెడ్డింగ్ ఈవెంట్ కోసం సల్మాన్ ఖాన్ రెండు కోట్ల పారితోషికం తీసుకోగా, షారుక్ ఖాన్ 3 కోట్లు పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది.వీరితో పాటు స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా రెండు కోట్ల రూపాయలు తీసుకుంటారట.

Advertisement

ఈ విధంగా ఈ బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా ఇలా ప్రైవేట్ ఈవెంట్లకు హాజరవుతూ అభిమానులను సందడి చేస్తూనే,భారీగా పారితోషికం తీసుకుంటారని తెలుస్తోంది.మొత్తానికి ఒక వైపు సినిమాలు మరొక వైపు ఈవెంట్ లతో ఈ స్టార్ సెలబ్రెటీలు ఎంతో బిజీబిజీగా గడుపుతూ ఉన్నారని చెప్పాలి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు