జామ ఆకులలో ఎన్ని సౌందర్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?

జామకాయ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనే విషయం మనకు తెలిసిందే.అలాగే జామ ఆకుతో ఎన్నో చర్మ సమస్యలకు పరిష్కారం చూపవచ్చు.

జామాకులో యాంటీ-బాక్టీరియా మరియు యాంటీ-ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండుట వలన చర్మ సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.ఇప్పుడు ఆ ప్రయోజనాల గురించి వివరంగా తెలుస్కుందాం.

జామ ఆకులను నీటిలో వేసి మరిగించాలి.ఆ ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి దానిలో కొంచెం పసుపు కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు సెహస్తు ఉంటే బ్లాక్ హెడ్స్ సమస్య తొలగిపోతుంది.జామ ఆకులను బాగా నలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాయాలి.

Advertisement

ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.జామలో ఉండే యాంటీ-బాక్టీరియా లక్షణాలు మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

దాంతో మొటిమలు తగ్గిపోతాయి.జామ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో ముఖాన్ని కడగాలి.

ఈ విధంగా తరచుగా చేస్తూ ఉంటే ముఖం మీద ముడతలు తొందరగా రావు.అంతేకాక చర్మంపై ప్రీ రాడికల్స్ ని తొలగించి ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది.

జామ ఆకుల్లోని కొన్ని కారకాలు చర్మంపై మంట, దురద తగ్గిస్తాయి.అలాగే కాలిన గాయాలను, చర్మ ఎలర్జీలను అవి కలిగించే బాక్టీరియాను చంపడం ద్వారా వాటిని త్వరగా మాన్పుతాయి.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
ఆర్జీవీని పటాయించే క్రమంలో వంశీ నాపై కుట్రలు చేశాడు- జేడీ చక్రవర్తి

జామ ఆకులను రుబ్బి, ఆ రసాన్ని ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు