బ్రహ్మోస్‌ క్షిపణికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా?

బ్రహ్మోస్‌ క్షిపణి గురించి వినే వుంటారు.ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్లో ఒకటిగా ఈ బ్రహ్మోస్ పరిగణించబడింది.

21వ శతాబ్దపు అత్యంత శక్తివంతమైన క్షిపణులలో ఒకటిగా నిపుణులు దీనిని పేర్కొన్నారు.దీని ప్రత్యేకత ఏమంటే, దీనిని ఎక్కడినుంచైనా ప్రయోగించవచ్చు.

అంటే జలాంతర్గామి ద్వారా అయినా, యుద్ధనౌక గుండానైనా, విమానం నుంచి, భూమి నుండి కూడా దీనిని టార్గెట్ చేయొచ్చు.ఈ క్షిపణి నుండి శత్రువుకు తప్పించుకునే అవకాశం అనేదే ఉండదు.

ఇకపోతే బ్రహ్మోస్‌లో పలు రకాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో బ్రహ్మోస్ అనే పేరుకు గల అర్థం చాలామంది వెంతుకుతుంటారు.

Advertisement

అయితే ఈ క్షిపణికి ఈ పేరు ఎందుకు వచ్చిందనే విషయం గురించి చాలా తక్కువ మందికి తెలుసు.కాగా ఈ క్షిపణి గత కొన్ని రోజులుగా వార్తల్లో నానుతోంది.

ఇటీవల బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణికి సంబంధించిన ఎయిర్ లాంచ్ వెర్షన్‌ను పలుమార్లు పరీక్షించారు.దాంతో బ్రహ్మోస్ శక్తికి శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

దాని సామర్థ్యంతో పాటు, దాని పేరు కారణంగా ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

భారతదేశంలో వున్న ఓ 2 నదుల పేర్లు కలిపి బ్రహ్మోస్ అని పేరు పెట్టారని చాలామంది అభిప్రాయం పడుతున్నారు.ఇకపోతే బ్రహ్మోస్ ను DRDO (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్), రష్యా సంయుక్తంగా తయారు చేశాయని ఎంతమందికి తెలుసు? అందరూ అనుకున్నట్టు దీనికి భారతదేశానికి చెందిన రెండు నదులు పేర్లు పెట్టలేదు.భారత దేశానికీ, రష్యాలకు చెందిన రెండు ప్రధాన నదుల పేర్లు పెట్టడం జరిగింది.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
అవసరమా భయ్యా.. కొత్త జంట ఫస్ట్ నైట్ వీడియో అంటూ..(వీడియో)

భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మోస్క్వా నది పేర్లను కలిపి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు.

Advertisement

తాజా వార్తలు