సోమవారం రోజు వచ్చిన ఈ అమావాస్య ప్రత్యేకత గురించి తెలుసా..?

సోమవారం రోజు వచ్చే అమావాస్య ( Amavasya )అత్యంత శక్తివంతమైనది.సోమవారంతో కూడిన అమావాస్య కావడంతో దీన్ని సోమావతీ అమావాస్య అని కూడా అంటారు.

ఇక ఇది కొన్ని కోట్ల సూర్యగ్రహణాలతో సమానం అని పండితులు చెబుతున్నారు.సోమవారం రోజు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ఈ రోజు ఉపవాసం ఉండి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు దూరం అయిపోతాయని శాస్త్రం చెబుతోంది.సుమావతి అమావాస్య రోజున శివరాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి సోమావతీ కథను ఒకసారి గుర్తు చేసుకుని ఉపవాస దీక్షను విరమించుకుంటే జాతక దోషాలు దూరం అయిపోతాయి.

ముఖ్యంగా చెప్పాలంటే సోమావతీ అమావాస్య రోజున ఆచరించవలసిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.సోమావతీ అమావాస్య రోజు న పేదవారికి అన్నదానం చేయడం ఎంతో మంచిది.అలాగే మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం.

Advertisement

ఈ సోమావతీ వ్రతాన్ని పాటించే భక్తులు ఈరోజు ఉదయమే రావి చెట్టు కు 108 ప్రదక్షిణలు చేయాలి.అలాగే శని మంత్రాన్ని( Shani Mantra ) పఠించి శ్రీమన్నారాయణ మూర్తిని ప్రార్థించాలి.

గంగా నది, త్రివేణి సంగమం లేదా ఏదైనా పుణ్య నదుల్లో ఈ సోమావతీ అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.అలాగే రోగాలు, బాధలు తొలగిపోతాయి.పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్లడానికి మార్గం ఏర్పడుతుంది.

వేద వ్యాస మహర్షి( Vyasa maharshi ) చెప్పిన దాని ప్రకారం సోమావతీ అమావాస్య రోజు పేదవారికి గుప్తా దానం చేసి పుణ్య నదులలో స్నానం ఆచరించిన వారికి 1000 గోవులను దానం చేసిన పుణ్యం లభిస్తుంది.ఈ అమావాస్య రోజున వివాహం అయిన మహిళలు, వివాహం కానీ మహిళలు రావి చెట్టు కు 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలు తీరుతాయి.

ఈ రోజుల్లో శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ( Srimannarayana ) ని, పార్వతీ పరమేశ్వరులను పితృదేవతలను పూజించాలి.మంచి పనులు చేయాలి.వీలైతే మౌనం పాటించాలి.

ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు పసుపును అస్సలు తినకూడదు.. తింటే మాత్రం..!
Advertisement

తాజా వార్తలు