అటుకుల బతుకమ్మ ప్రాముఖ్యత గురించి తెలుసా..!

ప్రతి సంవత్సరం ఆశ్వీయుజశుద్ధ అమావాస్య రోజు బతుకమ్మ పండుగ మొదలవుతుంది.అక్టోబర్ 14వ తేదీన ఎంగిలి బతుకమ్మ తో పండగ మొదలైంది.

ఆదివారం రోజు అటుకుల బతుకమ్మ ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.నవరాత్రులతో పాటు బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు.

తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పండుగ ఏ రోజుకు ఆ రోజు ఒక ప్రత్యేకత ఉంటుంది.నిన్న ఎంగిలి బతుకమ్మ నువ్వు జరుపుకుంటే, ఆదివారం రోజు అటుకుల బతుకమ్మ( Atukula Batukamma )ను జరుపుకున్నారు.

ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ వానకాలం ఎండింగ్లో, చలికాలం మొదలులో వస్తుంది.వర్షాకాలం వర్షాలతో ఇప్పటికే ఊర్లలో ఉన్న చెరువులో, కుంటలలో, బావులన్ని నీటితో నిండుకుండలా మారిపోయాయి.

Advertisement

దీంతో బీడు భూములన్నీ తీరొక్క పూలతో కళకళలాడుతున్నాయి.

మీరు గమనించారో లేదో మనం బతుకమ్మను స్థానికంగా దొరికే పూలతోనే పెరుస్తాము.ఈ సీజన్ లో గునుగు పూలు,తంగేడు పూలు, తామర పూలు, నందివర్ధనం పువ్వులు బాగా విరబూస్తాయి.అంతేకాకుండా బంతిపూలు కూడా ఈ సీజన్ లో బాగా లభిస్తాయి.

రకరకాల పూలతో మహిళలు బతుకమ్మను ఎంతో అందంగా పేరుస్తారు.ఈ పండుగ ఆడవాళ్లకు ఎంతో ప్రత్యేకమైనది.

బతుకమ్మ పండుగ వస్తుందంటే ఆడవాళ్లకు ఎక్కడలేని సంతోషం కలుగుతుంది.సీజన్లో లభించే ప్రతి పువ్వును తెచ్చి పోగేసి బతుకమ్మను పేరుస్తారు.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ప్రభాస్ కి, యష్ కి ఉన్న అతి పెద్ద తేడా అదే ..! 

తొమ్మిది రోజుల పండుగలో మహిళలు అంతా రోజు బతుకమ్మను చేసి ఆడి పాడుతారు.

Advertisement

బతుకమ్మ పండుగ ఎంగిలి బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మ( Saddula Bathukamma )తో ముగుస్తుంది.చివరి రోజు బతుకమ్మను పెద్దగా పేర్చి చెరువులో నిమజ్జనం చేస్తారు.ఈ బతుకమ్మపై పసుపుతో చేసిన గౌరమ్మను ఇంటికి తెస్తారు.

వీటిని పెళ్లయిన మహిళలు తమ మంగళసూత్రానికి పెట్టుకుంటారు.దీంతో వీరి దాంపత్య జీవితం బాగుంటుంది అని నమ్ముతారు.

సౌభాగ్యవతిగా ఉంటారని నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే బతుకమ్మ మొదటి రోజు ఎంగిలి బతుకమ్మను జరుపుకున్నారు.

అలాగే ఆదివారం రోజు అటుకుల బతుకమ్మను జరుపుకున్నారు.ఆదివారం రోజు నవరాత్రి ఉత్సవాలు కూడా మొదలయ్యాయి.

అయితే అటుకుల బతుకమ్మకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఎంగిలి బతుకమ్మ తర్వాత పిల్లలే బతుకమ్మను తయారు చేసి ఆడేవారు.

ఇక ఆ రోజు బెల్లం అటుకుల( Jaggery )ను నైవేద్యంగా పెట్టేవారు.అందుకే రెండో రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు.

తాజా వార్తలు