తెలుగులో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన కథానాయికగా నటించినటువంటి ముద్దుగుమ్మసమంత గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.ఈ అమ్మడు తన నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ అమ్మడు ఒక్క తెలుగులోనే కాక తమిళం, మలయాళం, కన్నడలో కూడా తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకుంది.అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకోవడంతో సినిమాల పరంగా కొంతమేర జోరుని తగ్గినట్లు తెలుస్తోంది.
అయితే గతంలో సమంత అక్కినేని ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.భాగంగా తన సినీ కెరీర్ కి సంబంధించిన పలు అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.
అయితే ఇందులో భాగంగా తాను చదువుకునే రోజుల్లో పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేసే దానిని ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు రవివర్మన్ హీరోయిన్ గా మొస్కోవిన్ కావేరి అనే చిత్రంలో అవకాశం ఇచ్చారన, కానీ ఈ చిత్రం తన తొలి చిత్రం అని దాదాపుగా చాలా మందికి తెలియదని చెప్పుకొచ్చింది.అయితే ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించినటువంటి ఏం మాయ చేశావే చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడంతో తనకు హీరోయిన్ గా గుర్తింపు మరియు పలు అవకాశాలు దక్కాయని చెప్పుకొచ్చింది.
అంతేగాక అప్పట్లో పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేయడం తన జీవితాన్ని మలుపు తిప్పిందని తెలిపింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు.అలాగే తమిళంలో కూడా ఓ ప్రముఖ దర్శకుడు చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది.