అసలు గుర్తు పట్టలేకుండా ఉన్న ఈ హీరోయిన్ ఎవరో చెప్పండి

ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో కనిపించి ఆ తర్వాత కనిపించకుండా పోయిన హీరోయిన్లు మళ్లీ ఒక్కసారి తెరమీద కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి.

ప్రేక్షకులందరికీ ఇలాంటి కొత్త అనుభూతిని పంచుతూ కొత్త ఎపిసోడ్ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు కమెడియన్ అలీ.

వెండితెరపై కమెడియన్గా అలరించిన అలీ ఇప్పుడు బుల్లితెరపై ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో ప్రేక్షకుల అలరిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.పాత హీరో హీరోయిన్లని తెరమీదికి తీసుకురావడమే పనిగా పెట్టుకున్నాడు.

ఇప్పటి వరకు ఎంతోమంది తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు చేసి అభిమానుల్ని సంపాదించుకున్న తర్వాత సినిమాలకు దూరమైన వారిని పిలిపించి వారి కెరీర్ విశేషాలను అందరితో పంచుకునేలా చేస్తున్నాడు.ఇక ఇప్పుడు మరో స్పెషల్ గెస్ట్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో కి వచ్చేసింది.ఆమె ఎవరో కాదు శుభశ్రీ.

శుభశ్రీ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది జెంటిల్మెన్ సినిమా.ఈ సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ కాదు కానీ హీరో ని ప్రేమించిన అమ్మాయి గా తన నటనతో ఆకట్టుకుంది.

Advertisement

కాగా తమిళ హీరోయిన్ అయినప్పటికి తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఇటీవలే 46 ఏళ్ల వయసులో ఆలీతో సరదాగా కార్యక్రమంలో తెరమీదికి వచ్చింది.దీంతో శుభశ్రీ ని చూసిన అభిమానులు అందరూ కూడా అవాక్కయ్యారు అనే చెప్పాలి.శుభశ్రీ లో ఎంత మార్పు వచ్చింది అంటున్నారు.

మరి అప్పుడప్పుడు యంగ్ ఏజ్ లో చూసిన ప్రేక్షకులు మళ్లీ 46 ఏళ్ల తర్వాత చూస్తే మార్పు రాకుండా ఉంటుందా చెప్పండి.ఏదేమైనా ఇక శుభశ్రీ అభిమానులు అందరూ ఈ అమ్మడు మరోసారి తెరమీదకు తీసుకురావడంతో అలీ కీ థాంక్స్ చెబుతున్నారు.

అయితే ఇక ఈ హీరోయిన్ తీసుకు వచ్చినా ఆలీతో సరదాగా రేటింగ్ మాత్రం మారకపోవడం గమనార్హం.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు