పిల్ల‌లను వేగంగా నిద్ర‌పుచ్చాలంటే.. ఇలా చేయండి!

పిల్ల‌ల‌కు నిద్ర చాలా ముఖ్యం.నిద్రే పిల్ల‌ల మాన‌సిక‌, శారీర‌క అభివృద్ధికి తోడ్ప‌డుతుంది.

పిల్ల‌లు క‌నీసం ప‌ది గంట‌ల‌కు పైగా ప‌డుకోవాలి.కానీ, పిల్ల‌ల‌ను నిద్ర పుచ్చ‌డం అనేది త‌ల్లిదండ్రుల‌కు చాలా క‌ష్ట‌మైన ప‌ని అని చెప్పాలి.

ఎందుకంటే, పిల్ల‌లు ఓ ప‌ట్టాన నిద్ర‌పోరు.ఫ‌లితంగా, పిల్ల‌ల‌తో పాటుగా త‌ల్లిదండ్రులు కూడా ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది.

అయితే కొన్ని కొన్ని సింపుల్ చిట్కాల‌ను ఫాలో అయితే చాలా సులువుగా పిల్ల‌ల‌ను నిద్ర పుచ్చ‌వ‌చ్చు.మ‌రి ఆ టిప్స్ ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సాధార‌ణంగా పిల్ల‌లు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు.అందువ‌ల్ల‌, వారు బాగా చ‌ల్ల‌గా ఫీల్ అయినా లేదా బాగా వేడిగా ఫీల్ అయినా అస్స‌లు నిద్ర‌పోరు.

కాబ‌ట్టి, పిల్ల‌లు త్వ‌ర‌గా నిద్ర‌పోవాలంటే వారికి త‌గిన వాతావ‌ర‌ణం క‌ల్పించాలి.అలాగే పిల్ల‌లు త్వ‌ర‌గా నిద్ర‌పుచ్చాలంటే ఉల్లిని ఉప‌యోగించ‌వ‌చ్చు.

ఎలాగంటే, ఉల్లిపాయ పొట్టును తీసుకుని వాట‌ర్‌లో మ‌రిగించుకోవాలి.ఈ నీటిని వ‌డ‌గ‌ట్టి అందులో కొద్దిగా షుగ‌ర్ యాడ్ చేయాలి.

ఆ త‌ర్వాత ఈ వాట‌ర్‌ను ఒక‌టి లేదా రెండు స్పూన్ల చ‌ప్పున పిల్ల‌ల‌కు తాగించాలి.ఇలా చేస్తే పిల్ల‌లు చ‌క్క‌గా నిద్ర‌పోతారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఇక కొంద‌రు పిల్ల‌లు బెడ్‌పై అస్స‌లు ప‌డుకోరు.అలాంటి వారిని ఊయలలో లేదా భుజాల‌పై ప‌డుకోబెడితే త్వ‌ర‌గా నిద్ర‌పోతారు.ఆ త‌ర్వాత వారిని బెడ్‌పైకి షిఫ్ట్‌ చేసుకోవ‌చ్చు.

Advertisement

అలాగే పిల్ల‌ల‌ను నిద్ర‌పుచ్చ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అయినా ప‌డుకోకుంటే వారిపై చిరాకు ప‌డుతుంటారు.

అయితే అలా కాకుండా ప్ర‌శాంతగా పిల్ల‌ల‌తో ఆడుకోవ‌డం లేదా ఆడించ‌డం చేస్తే అల‌సిపోయి త్వ‌ర‌గా నిద్ర‌పోతారు.

అదేవిధంగా, ఆక‌లి వేసినా పిల్ల‌లు త్వ‌ర‌గా నిద్ర‌పోలేరు.కాబ‌ట్టి, ఆరు నెల‌ల లోపు పిల్ల‌ల‌కు త‌ర‌చూ త‌ల్లి పాలు ప‌ట్టించ‌డం చేస్తుండాలి.అలాగే ఆరు నెల‌లు పైగా ఉన్న పిల్ల‌ల‌కు పాల‌తో పాటుగా త్వ‌ర‌గా జీర్ణం అయ్యే ఆహారాన్ని కూడా పెడుతూ ఉండాలి.

తాజా వార్తలు