చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాల ప్యాకేట్స్ పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలంలోని లింగవారి గూడెం గ్రామంలో అంధుల అక్షర శిల్పి లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా మా గురువు చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ బికుమండ్ల సుధీర్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మినరల్స్ కలిగిన పాల ప్యాకెట్స్ సివియర్ డిసబిలిటీ వెల్ఫేర్ సొసైటీ కత్తుల బాలు చేతుల మీదుగా పంపిణీ చేశారు.

అనంతరం పాఠశాలను సందర్శించి పాఠశాలకు కావలసిన బుక్స్ మెటీరియల్స్ త్వరలో ట్రస్టు ద్వారా అందిస్తామని తెలిపారు.

ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్.సంధ్యారాణి,శ్రీధర్,నరసింహ,స్వామి,శివ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు

Latest Yadadri Bhuvanagiri News