ఏపీ దిశ యాక్ట్.. రేప్ చేస్తే మరణ శిక్షే

రేప్ చేస్తే.మరణశిక్షే విధించేలా ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

ఓ చరిత్రాత్మక బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా ఏపీ క్రిమినల్‌ లా చట్టం 2019 సవరణకు కేబినెట్‌ అనుమతి తెలిపింది.

రేప్‌ చేస్తే ఉరిశిక్ష విధించేలా బిల్లుకు రూపకల్పన చేశారు.వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి, 14 రోజుల్లో విచారణ పూర్తయ్యేలా బిల్లును రూపొందించారు.

నేరం రుజువైతే 21 రోజుల్లో తీర్పు వచ్చేలా చట్టం చేయనుంది ఏపీ సర్కార్.ఇప్పటి వరకు ఉన్న నాలుగు నెలల విచారణ సమయాన్ని.21 రోజులకు కుదించారు.ఏపీ దిశ యాక్ట్‌గా ఈ చట్టానికి నామకరణం చేశారు.

Advertisement

ఇందులో భాగంగా భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 354కు సవరణలు చేసి కొత్తగా 354-ఈ చేర్చింది.ఈ చట్టం ద్వారా అత్యాచారానికి పాల్పడిన ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెలువడనుంది.

అత్యాచార బాధితురాలికి వెంటనే న్యాయం జరిగేలా జగన్ ప్రభుత్వం అడుగులు వేసింది.ఇందులో భాగం ఏపీ దిశ యాక్ట్‌కు శ్రీకారం చుట్టింది.ఈ యాక్ట్ ప్రకారం అత్యాచార కేసు నమోదైన వారంరోజుల్లోగా విచారణ పూర్తిచేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి రెండు వారాల్లోగా ట్రయల్ పూర్తి చేసి శిక్ష పడేలా చేయడం ఈ చట్టం ఉద్దేశం.

కచ్చితమైన ఆధారాలుంటే నిందితులకు మూడు వారాల్లోగా ఉరిశిక్ష విధించడానికి ఈ చట్టం దోహదం చేస్తుంది.అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు తదితర నేరాలకు సత్వరమే విచారణ చేసేందుకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయనుంది.

సోషల్‌ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టింగ్‌లు పెడితే సెక్షన్‌ 354-ఈ కింద చర్యలు తీసుకునేలా ఈ బిల్లును ప్రతిపాదించారు.ఇక, సోషల్‌ మీడియాలో మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

పెట్టే పోస్టులను బట్టి.రెండేళ్లు, నాలుగేళ్లు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

చిన్న పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే 354 (ఎఫ్‌) కింద ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలుశిక్ష పడనుంది.

తాజా వార్తలు