కొడుకు దూరం.. మేనల్లుడిపైనే భారం ? దటీజ్ కేసీఆర్

టిఆర్ఎస్ కు సంబంధించి ఏ కీలక నిర్ణయాలు అయినా తీసుకునేది కేసిఆర్.

ఆయన తరువాత పూర్తిగా భాధ్యతలన్ని కేసీఆర్ కుమారుడు,  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకుంటారు.

అయితే ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గం లో జరుగుతున్న ఎన్నికల విషయంలో కేసీఆర్ మాత్రమే యాక్టివ్ గా పని చేస్తున్నారు.తనకు సంబంధం లేదన్నట్లుగానే కేటీఆర్ వ్యవహరిస్తున్నారు.

ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ బాధ్యతలను మంత్రి హరీష్ రావు పైన కేసీఆర్ మోపారు.వాస్తవంగా మెదక్ జిల్లాకు చెందిన హరీష్ రావుకు ఈ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడం పై ఎన్నో గుసగుసలు వినిపించాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రిగా ఉన్న కేటీఆర్ అదే జిల్లాలో జరుగుతున్న  ఎన్నికలపై ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు అనేది ప్రశ్నగా మారింది.         మొన్నటి వరకు పెద్దగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాధాన్యం లేనట్టుగా ఇబ్బందులు ఎదుర్కొన్న హరీష్ రావు కు ఇప్పుడు అకస్మాత్తుగా ప్రాధాన్యం పెరిగింది.

Advertisement

  కీలక అంశాలపై ఆయన అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.హుజూరాబాద్ నియోజకవర్గం బాధ్యతలు పూర్తిగా తీసుకుని అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు చక్క దిద్దుతూ వస్తున్నారు.

బిజెపి , కాంగ్రెస్ ల నుంచి పెద్ద ఎత్తున నాయకులు టిఆర్ఎస్ లోకి వచ్చే విధంగా హరీష్ రావు చేస్తున్నారు.అలాగే ఈటెల రాజేందర్ పైన హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

టిఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన హరీష్కు ఈ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడం పెద్దగా ఆశ్చర్యమేమీ కాకపోయినా,  ఈ నియోజకవర్గంలో టిఆర్ఎస్ కు గెలుపు అవకాశాలు ఉండేలా చేయాల్సినా, ఎందుకు సైలెంట్ గా ఉండి పోతున్నారు ? కేసీఆర్ ఆయనకు ఎందుకు ఆ బాధ్యతలు అప్పగించడం లేదా అనేది ప్రశ్నగా మారింది.   

   అయితే కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం జరుగుతోంది.ఇప్పుడు ఆయనకి బాధ్యతలు అప్పగిస్తే ఈటెల రాజేందర్ వంటి వారు తీవ్రస్థాయిలో కేటీఆర్ ను ఇస్తారు.రాజేందర్ కు పార్టీలో అన్ని వ్యవహారాలు బాగా తెలుసునని, మొదటి నుంచి కేటీఆర్ ఉద్యమంలో లేకపోవడంతో ఆ విషయాలు ప్రస్తావించి కేటీఆర్ ను ఇరుకున పెడతాడని భావించే వ్యూహాత్మకంగా హుజురాబాద్ ఎన్నికల విషయంలో  జోక్యం చేసుకోకుండా చేశారా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

వారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది .. కేటీఆర్ సెటైర్లు 
Advertisement

తాజా వార్తలు