Disco Shanti: ప్రకాష్ రాజ్ రెండో భార్య కూడా నన్ను అక్క అని పిలుస్తుంది : డిస్కో శాంతి

రియల్ స్టార్ శ్రీహరి భార్య డిస్కో శాంతి( Disco Shanti ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఆమె ఐటమ్ గర్ల్ గా ఎన్నో పెద్ద చిత్రాల్లో శృంగార పాటలకు డాన్స్ చేసి అప్పటి కుర్రకారును ఉర్రూతలూగించింది.

చిరంజీవితో బంగారు కోడిపెట్ట అంటూ ఆమె చేసిన పాట అప్పట్లో పెద్ద సంచలనమే. శ్రీహరి( Sri Hari ) చనిపోయిన తర్వాత తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన శాంతి మధ్య మధ్యలో కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది.

తన భర్త ఎలాగూ లేడు కానీ పిల్లలు మాత్రం సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారు, చిన్న అవకాశాలు మాత్రమే వస్తున్నాయి అంటూ ఆవిడ పెదవి విరిచారు.ఇక ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాంతి ఆమె వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలను తెలియజేశారు అందులో ముఖ్యంగా ప్రకాష్ రాజ్ విడాకుల గురించి కూడా ఆమె ప్రస్తావించారు.

శాంతి చెల్లెలు లలిత ను( Lalitha ) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రకాష్ రాజ్.అయితే వీరిద్దరూ విడిపోవడం గురించి ఎప్పుడూ తనకు చెప్పలేదని ప్రకాష్ రాజు( Prakash Raj ) కూడా అతని భార్యను ఏనాడు తప్పుగా మాట్లాడలేదని అలాగే తన చెల్లెలు లలిత కూడా ప్రకాష్ గురించి చెడుగా చెప్పలేదని వాళ్ళిద్దరూ అనుకుని విడాకులు తీసుకున్నారని ఆ విషయం గురించి మాకు ఎవరికీ చెప్పలేదని తెలిపారు.అయితే ప్రకాష్ రాజ్ మళ్లీ పెళ్లి చేసుకున్న పోనీ వర్మ( Pony Varma ) తనకు ఎంతో క్లోజ్ అని కూడా చెప్పారు శాంతి.

Advertisement

ప్రకాష్ రాజ్ రెండో భార్య పోనీ ఎక్కువగా మా ఇంటి చుట్టుపక్కలే వాకింగ్ చేస్తూ ఉంటుందని తాను కూడా వాకింగ్కు వెళ్ళినప్పుడల్లా తాను కలుస్తుందంటూ చెప్పింది.

కొడుకుని కూడా తనకు పరిచయం చేసిందని, అక్క అంటూ తనను పిలుస్తుందని ఆమెపై మాకు ఎలాంటి కోపం లేదని ప్రకాష్ రాజ్ కూడా మొదట్లో నన్ను చూస్తే పక్కకు వెళ్లిపోయేవాడు.కానీ మొన్నటి మా ఎలక్షన్స్ తర్వాత అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నామని తన చెల్లెలు కూతుర్లతో ప్రకాష్ ఎంతో సన్నిహిత్యంగా ఉంటాడని అతనిపై తమకు ఎలాంటి కోపం లేదని చెప్పారు శాంతి.ప్రకాష్ రాజ్ రెండో పెళ్లి చేసుకుని సంగతి మన అందరికీ తెలిసిందే.

అయినా కూడా మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఆ వారిద్దరి బాధ్యతను ప్రకాష్ చూసుకుంటున్నాడు.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు