తొలి ప్రేమ లాంటి సినిమా చేద్దాం అనుకున్న కానీ ఫ్యాక్షన్ సినిమా చేయాల్సి వచ్చింది...

తొలిప్రేమ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే ఈ సినిమాతోనే పవన్ కళ్యాణ్ స్టార్ హీరో గా పేరు సంపాదించుకున్నాడు.

ఈ సినిమా వచ్చి హిట్ అవడం తో అపుడు ఉన్న చాలా మంది డైరెక్టర్స్ మనం కూడా ఇలాంటి సినిమా తీయాలి అనుకున్నారు.

అందులో కొందరు తీశారు కొన్ని హిట్ అయితే చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి.కానీ అప్పుడే ఇండస్ట్రీ లో కొత్తగా సినిమాలు తీయాలి అనుకున్న చాలా మంది డైరెక్టర్స్ కి ఈ సినిమా ఒక మైలురాయిగా నిలించింది అని చెప్పవచ్చు.

అప్పటివరకు టాలెంటెడ్ డైరెక్టర్ అయిన సాగర్ గారి దగ్గర ఈ.వి.వి గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన వి వి వినాయక్ కూడా డైరెక్టర్ గా మారి తొలిప్రేమ లాంటి సినిమా తీయాలి అని అనుకుంటున్నా టైం లో జూనియర్ ఎన్టీఆర్ కి ఒక కథ చెప్పే అవకాశం వచ్చింది.ఆయాన దగ్గరికి వెళ్లి వినాయక్ ఎన్టీఆర్ కి ఒక మంచి లవ్ స్టోరీ చెప్పాడు ఆ స్టోరీ ఎన్టీఆర్ కి నచ్చి ముందు చేద్దాం అని చెప్పి ఆ తర్వాత లవ్ స్టోరీ వద్దు ఒక ఫ్యాక్షన్ స్టోరీ ఏదైనా ఉంటె చెప్పు అనగానే వినాయక్ చాలా బాధపడ్డాడు అయినప్పటికీ వచ్చిన ఛాన్స్ వదులుకోకూడదు అనుకొని తన దగ్గర ఉన్న ఒకటి రెండు ఐడియా లు చెప్పాడు.

దాంతో ఎన్టీఆర్ కి ఆ ఐడియాలు నచ్చి ఫుల్ స్టోరీ రాసుకొని రండి మనం సినిమా చేద్దాం అని చెప్పాడట దాంతో వినాయక్ ఆది కథ రాసి చెప్పడం తో ఎన్టీఆర్ ఒకే అన్నాడు అలా ఆది సినిమా చేసి హిట్ కొట్టారు.దాంతో వినాయక్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.వరసగా వినాయక్ బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలని డైరెక్ట్ చేసాడు.

Advertisement

వీళ్లతోపాటు యంగ్ హీరోలైన నితిన్, రాంచరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ లకు కూడా సూపర్ హిట్స్ ఇచ్చాడు.

చిరంజీవి రీఎంట్రీ సినిమాని కూడా వినాయక్ డైరెక్షన్ చేసి మంచి హిట్ అందుకున్నాడు ప్రస్తుతం బాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరో గా ఛత్రపతి సినిమాని చేస్తున్నాడు.బాలీవుడ్ లో కనక ఈ సినిమా హిట్ అయితే తెలుగు నుంచి బాలీవుడ్ స్థాయి కి ఎదిగిన డైరెక్టర్ లలో వినాయక్ కూడా పేరు సంపాదించుకుంటాడు ఇక ఇది ఇలా ఉంటె ఈ సినిమా తర్వాత మళ్ళి చిరంజీవి హీరోగా ఇంకో సినిమా చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు