నటుడు తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తారకరత్న ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతున్నట్లు తెలిపారు.
ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని పేర్కొన్నారు.