మన టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోయిన్స్ లో గ్లామర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు.2007 లో డైరెక్టర్ తేజ -హీరో కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన లక్ష్మి కళ్యాణం అనే మూవీ తో టాలీవుడ్ హీరోయిన్ గా పరిచయం అయింది ఈ ముంబాయి ముద్దుగుమ్మ .ఇక లక్ష్మి కళ్యాణం మూవీ లో కాజల్ యాక్టింగ్ కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు .లక్ష్మి కళ్యాణం మూవీ తరువాత హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు వరుస ఆఫర్స్ వచ్చాయి .లక్ష్మి కళ్యాణం మూవీ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో చందమామ అనే సినిమాలో నటించింది , ఈ మూవీ లో కాజల్ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు .ఇక చందమామ మూవీ హిట్ అవ్వడంతో కాజల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది .ఇక కాజల్ కెరీర్ లో ఓ పక్క గ్లామర్ రోల్స్ చేస్తున్నప్పటికీ ఆ తరువాత 2009 లో డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన మగధీర మూవీ లో యువరాణి గా నటించి బిగ్గెస్ట్ హిట్ అందుకొని కాజల్ స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరిపోయింది.
ఇక అసలు విషయానికి వస్తే .టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను 2020 లో పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే .ఇక ఈ పెళ్లి తరువాత కాజల్ సినిమాలకు దూరం అవుతుంది ,అని చాలా మంది అభిప్రాయపడ్డారు .ఇక ఫైనల్ గా డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ -మంచు విష్ణు కాంబినేషన్ లో వచ్చిన , మోసగాళ్లు మూవీ లో హీరోయిన్ కాజల్ మంచు విష్ణు కు సిస్టర్ రోల్ లో నటించింది .ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది .ఇక ఆ తరువాత 2022 లో డైరెక్టర్ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ వచ్చిన యాక్షన్ డ్రామా మూవీ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ మొదటగా నటించింది , కానీ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయ్యాకా కొన్ని అనివార్య కారణాల వల్ల కాజల్ ఈ మూవీ నుండి తప్పుకుంది .
ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్ .మల్లి కాజల్ ఎప్పుడు ఫుల్ లెంగ్త్ రీ -ఎంట్రీ ఇస్తుందో అని తమ అభిమానులు ఎదురుచూస్తున్నారు .ఇక కాజల్ రీ – ఎంట్రీ కోసం చాలా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి .ఇక అసలు విషయానికి వస్తే .నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డి చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచివిజయం సాధించింది.ప్రస్తుతం బాలయ్య తన నెక్స్ట్ మూవీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు.ఎన్బీకే 108గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి.
డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాలు అంటేనే వినోదం ఎక్సపెక్ట్ చేస్తారు ప్రేక్షకులు , మరి బాలయ్య అంటేనే మాస్ ఇమేజ్ ,ఈ రెండిటిని డైరెక్టర్ అనిల్ ఎలా బాలన్స్ గా హ్యాండిల్ చెయ్యగలరు అనే డౌట్స్ ప్రేక్షకుల్లో ఉన్నాయి .బాలకృష్ణ ని దృష్టి లో పెట్టుకొని అనిల్ కామెడీ మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది .ఈ మూవీ లో నటించే కాస్టింగ్ గురుంచి ఎటువంటి అప్ డేట్స్ తెలియడంలేదు .ఇక హీరోయిన్ల విషయంలో ఇంకా క్లారిటీ లేదు .ఫైనల్ ఈ మూవీ లో బాలయ్యకి జోడిగా కాజల్ అగర్వాల్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.మొత్తానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య మూవీ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫిక్స్ అయితే త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుంది .