ఆర్జీవీ మామూలోడు కాదు గా : అమ్మాయి తొడలని ముద్దు పెట్టుకుంటూ....

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సహవాసం చేస్తూ ముక్కుసూటిగా మాట్లాడుతూ తనకు నచ్చిన లైఫ్ ని లీడ్ చేస్తూ ఎంతో మంది యువ డైరెక్టర్లకు ఆదర్శంగా నిలుస్తున్న ప్రముఖ సీనియర్ డైరెక్టర్ "రామ్ గోపాల్ వర్మ" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

అయితే ఈ మధ్యకాలంలో దర్శకుడు "రామ్ గోపాల్ వర్మ" సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను బాగానే అలరిస్తున్నాడు.

అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసినటువంటి ఓ ఫోటో ద్వారా మరో మారు సోషల్ మీడియా మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారాడు.అయితే ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే రామ్ గోపాల్ వర్మ ఏకంగా నూతన నటి సోనియా తొడలను ముద్దుపె ట్టుకుంటూ ఫోటోలకి ఫోజులు ఇచ్చాడు.

అంతేకాకుండా "ఇన్సిడెంటల్లీ షీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ తైస్" అని క్యాప్షన్ కూడా పెట్టాడు.దీంతో రామ్ గోపాల్ వర్మ ని కొంత మంది నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

అంతేకాకుండా సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలాంటి అసభ్యకరమైన ఫోటోలకి ఫోజులు ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి వెంటనే ఆ ఫోటోలను తొలగించాలని కోరుతున్నారు.మరికొందరు మాత్రం రాంగోపాల్ వర్మ రోజురోజుకి తెగ రొమాంటిక్ గా మారుతున్నాడని అలాగే ఆర్జివి లాంటి విలాసవంతమైన లైఫ్ అందరికీ దొరకదని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

అయితే ఇటీవలే రామ్ గోపాల్ వర్మ ఓటిటి ప్లాట్ ఫారం బిజినెస్ లోకి అడుగు పెట్టాడు.ఈ క్రమంలో స్పార్క్ ఓటిటితో చేతులు కలిపి తన చిత్రాలను విడుదల చేశాడు.కానీ ఈ బిజినెస్ పెద్దగా వర్కవుట్ అయినట్టు లేదు.

కాగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ "ఎంటర్ ది గర్ల్ డ్రాగన్" అనే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రాన్ని తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు