ఫ్లాప్ సినిమా లైగర్ గురించి మెగాస్టార్ తో ధైర్యంగా సంచలన నిజాలు చెప్పిన పూరి..

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు.ఎందరో మహానటులతో సరి సమానంగా నటించి గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి నేటితరం హీరోలకు పోటీగా తెలుగు తెరపై నటిస్తూ అభిమానులను మెప్పిస్తున్నారు.

 Director Puri Jagannath To Chiranjeevi About Liger Flop Details, Director Puri J-TeluguStop.com

గత కొన్ని నెలల క్రితం ఆచార్య సినిమాతో కాస్త నిరాశ చెందిన చిరు మళ్ళి గాడ్ ఫాదర్ సక్సెస్ తో జోష్ లోకి వచ్చారు.ఈ సినిమా సక్సెస్ ను ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరితో మెగాస్టార్ పంచుకున్నారు.

తాజాగా స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ మెగాస్టార్ వీడియో రూపంలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.ఈ దర్శకుడు మెగాస్టార్ ఇద్దరు కలిసి అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకున్నారు.

అయితే లైగర్ ప్లాప్ ఫై పూరి రియాక్షన్ ను చిరు ఇన్ డైరెక్ట్ గా ప్రశ్నించగా, దీనికి పూరి తనదైన స్టయిల్ లో సమాధానం ధైర్యంగా చెప్పాడు.ఈ ప్రశ్నకు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ సక్సెస్ వస్తే చాలా ఎనర్జీ వస్తుంది.

అదే ఫెయిల్యూర్ వస్తే ఉన్న ఎనర్జీ పోతుంది.సక్సెస్ వచ్చినప్పుడు మనమొక జీనియస్‌లాగా కనబడుతాం.

అదే ఫెయిల్ అయితే ఒక ఫూల్‌లా చూస్తారు.సినిమాకు పని చేసినవాళ్లు, నమ్మినోళ్లు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంటారు.

Telugu Acharya, Chiranjeevi, Chiranjeevipuri, Puri Jagannath, God, Liger, Liger

ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఓ హీలింగ్ టైమ్ ఉంటుంది.ఆయితే ఎన్ని జరిగినా హీలింగ్ సమయం ఒక నెల కంటే ఎక్కువగా ఉండకూడదు.మళ్లీ నెక్ట్స్ పని చేసుకోవాలంతే.లైగర్ సినిమా చేసే క్రమంలో నేను మైక్ టైసన్‌తో షూటింగ్ చేయటం, మూడేళ్లు ఎంజాయ్ చేశాను.అయితే ఫెయిల్యూర్ వచ్చింది.అది మన చేతిలో లేదు.దానికి మరో మూడేళ్లు ఏడవడం నావల్ల కాదు అన్నారు.ప్రస్తుతం ఈ డాషింగ్ దర్శకుడు పూరి చెప్పిన మాటలు వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube