దురదృష్టం అయితే చాలా మందికి నీడలా వెంటాడుతుందేమో కానీ అదృష్టం మాత్రం ఊరకనే వచ్చి పడిపోదు.అదృష్ట దేవత కరుణించక పోదా అంటూ ఏళ్ళ తరబడి ఎదురు చూసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
అయితే కొందరికి మాత్రం నిరీక్షణ లేకుండానే అదృష్టం వరిస్తుందిలెండి ఆ సంఖ్య కూడా తక్కువే కానీ ఏళ్ళుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వారి సంఖ్య పెద్దదే.దుబాయ్ లో ఉంటున్న భారతీయ వ్యక్తి ఈ కోవకి చెందిన వాడే.
లక్కు చాలా లేటుగా వచ్చినా రావడంలో మాత్రం భారీగానే వచ్చి పడింది.వివరాలలోకి వెళ్తే…
భారత్ నుంచీ 15 ఏళ్ళ క్రితమే దుబాయ్ వెళ్లి స్థిరపడిన రాజమోహన్ అనే వ్యక్తికి దుబాయ్ లో నిర్వహించే దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీలో ఎప్పటికప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకునే వాడు.
చిన్న చితకా ఉద్యోగాలు చేసుకుంటూ ఎంత కాలం ఇలా ఉంటామని వెళ్ళిన నాటి నుంచీ లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తూనే ఉన్నాడు.అలా సుమారు 15 ఏళ్ళుగా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నా ఏ నాడు కూడా అదృష్ట దేవత వరించలేదు.
అయినా సరే నిరాస చెందకుండా చివరి సారిగా లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేశాడు.ఇందులో లక్కు వస్తే సరి లేదంటే తన ప్రయత్నాని విరమించాలని భావించాడు…కానీ
ఊహించని విధంగా లచ్చిం దేవి రామ్మోహన్ తలుపు తట్టింది.చివరిసారిగా కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్టు కు ఏకంగా రూ.8 కోట్లు గెలుచుకున్నాడు. దుబాయ్ ఇంటర్నేషల్ ఎయిర్ పోర్ట్ లో నిర్వహించిన డ్రా లో ఇంత పెద్ద మొత్తం గెలుచుకున్నాడు.ఈ విషయాన్ని మొదట్లో నిర్వాహకులు చెప్పినా రామ్మోహన్ కు నమ్మసఖ్యం కాలేదు.
టిక్కెట్టు నెంబర్ చెప్పగానే ఇది తనదేనా అనే ఆలోచనలోనే ఉండిపోయాడట.ఈ డబ్బుతో తన ఆర్ధిక కష్టాలు తీరిపోతాయని, మంచి బిజినెస్ మొదలు పెడుతానని రామ్మోహన్ తెలిపాడు.
కాగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ లో ఇప్పటి వరకూ డ్రా గెలుచుకున్న వారిలో అత్యధిక శాతం మంది భారతీయులే ఉన్నారని నిర్వాహకులు ఓ ప్రకటన లో తెలిపారు.