మా ఎన్నికల్లో తాను చేసిన వాగ్దానాలు అన్ని 90 శాతం వరకు పూర్తయ్యాయి అంటున్నాడు మంచు విష్ణు. కాగా సంక్రాంతి పండుగ తరువాత మా కోసం యాప్ తీసుకొస్తానని, నటీనటుల అవకాశాల కోసం ప్రత్యేక బుక్‌లెట్ తయారుచేశామని ప్రకటించాడు.
అయితే మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తైన సందర్భంగా మంచు విష్ణు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఆ కార్యక్రమానికి మోహన్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.2021 జరిగిన మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి.అక్టోబర్ 13న నేను మా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాను.
నేను ఎలక్షన్స్‌లో పోటీ చేసినప్పుడు సినీపరిశ్రమలో ఎంతో అలజడి నెలకొంది.కాగా మా అసోసియేషన్‌లో నటులు కాని సభ్యులు 20 శాతం మంది ఉన్నారని, అందుకే మా అసోసియేషన్ సభ్యత్వం కఠినంగా ఉండేవిధంగా ఒక తుది నిర్ణయం తీసుకున్నాము.
మా లో ఉన్నా సభ్యులు కనీసం రెండు చిత్రాల్లో నటించి, అవి విడుదలైతేనే వారికి మాలో శాశ్వత సభ్యత్వం ఉంటుందని, అంతే కాకుండా కనీసం ఐదు నిమిషాలైనా సినిమాలో కనిపించి డైలాగ్ చెప్పిన వాళ్లకు మాత్రమే మా అసోసియేట్ సభ్యత్వం కల్పిస్తము.
లేదంటే అసోసియేట్ సభ్యులకు మాలో ఓటు హక్కు లేదు.అలా కాదని మా అసోసియేషన్‌కు ఎవరైనా నటీనటులు వ్యతిరేకంగా కార్యవర్గ సభ్యులు ధర్నాలు చేసినా, మీడియాకు వెళ్లినా వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తాం అని చెప్పి అందరికి షాక్ ఇచ్చారు మంచు విష్ణు.అలాగే ఐదేళ్లు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే మా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని అసోసియేషన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టినా వారు పోటీకి అనర్హులవుతారు అని తెలిపారు విష్ణు.
ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబర్ భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం కట్టేందుకు నేను ఖర్చు భరిస్తాను అని చెప్పుకొచ్చారు విష్ణు.