తమిళ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్న డైరెక్టర్ పరశురామ్.. ఆ హీరో ఎవరంటే?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది.దీంతో దర్శకులు స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాల వైపే మొగ్గుచూపుతున్నారు.

కేవలం ఆయా ఇండస్ట్రీల హీరోలు దర్శకులు మాత్రమే కాకుండా టాలీవుడ్ హీరోలతో కోలీవుడ్ దర్శకులు,కోలీవుడ్ హీరోలతో టాలీవుడ్ దర్శకులు సినిమాలు చేయడానికి పోటీపడుతున్నారు.ఇక నేడు ధనుష్ తో వెంకీ అట్లూరి సార్ మూవీ తెరకెక్కించగా, మరోవైపు రామ్ చరణ్ తో దర్శకుడు శంకర్ సినిమా నాగచైతన్యతో వెంకట్ ప్రభు ఇలా కొన్ని క్రేజీ ప్రాజెక్టులు షూటింగ్ దశలో ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ లిస్ట్ లోకి మరో డైరెక్టర్ కూడా చేరారు.టాలీవుడ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాట సినిమా చేసిన విషయం మనందరికి తెలిసిందే.ఆ సినిమా వచ్చి ఏడాది కావస్తోంది అయినా ఇప్పటిదాకా పరశురామ్ తదుపరి సినిమా ఎవరితో అనేది ఇంకా తెలియలేదు.

ఈ క్రమంలోనే ఇటీవల విజయ్ దేవరకొండ, దిల్ రాజు కాంబినేషన్ లో ఓ సినిమా అనౌన్స్ చేసినప్పటికీ, అదే సమయంలో నిర్మాత అల్లు అరవింద్ పేరు చర్చల్లోకి వచ్చి ఆ సినిమా మ్యాటర్ ఎటు తేలలేదు.

Advertisement

ఈ నేపథ్యంలోనే తాజాగా పరశురామ్ ఓ తమిళ స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.డైరెక్టర్ పరశురామ్, హీరో కార్తీని కలిసి ఓ స్టోరీ వినిపించాడని, అందుకు కార్తీ కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ఇప్పటికే కార్తీ యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ, ఖైదీ, ఖాకీ, సర్దార్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

అయితే కార్తీ, పరశురాం ప్రాజెక్టు కి సంబంధించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.మరి ఈ విషయంపై హీరో కార్తీ, లేదా డైరెక్టర్ పరుశురాం స్పందించేంతవరకు వేచి చూడాల్సిందే మరి.

Advertisement

తాజా వార్తలు