ఎన్టీఆర్ 'దేవర' చిత్రం కోసం 80 కోట్లు విలువ చేసే కెమెరా సిద్ధం..కొరటాల ప్లానింగ్ మామూలుగా లేదు!

#RRR మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్( Jr NTR ) చేసే సినిమా కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూసారో మన అందరికీ బాగా తెలిసిందే.

షూటింగ్ చాలా ఆలస్యం గా మొదలైన ఈ సినిమా అప్పుడు నాలుగు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుందట.

ఎట్టిపరిస్థితి లో ఈ సినిమాని ఏప్రిల్ 5 వ తారీఖున విడుదల చెయ్యాలనే పట్టుదలతో డైరెక్టర్ కొరటాల శివ( Director Koratala Siva ) ఉన్నాడట.ఈ ఏడాది నవంబర్ లోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అవుతాయట.

ఆ తర్వాత సెప్టెంబర్ నుండి ఎన్టీఆర్ హ్రితిక్ రోషన్ తో కలిసి వార్ 2 చిత్రం చెయ్యబోతున్నాడు.ఆచార్య లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల శివ తీస్తున్న చిత్రం ఇది.ఈ స్క్రిప్ట్ కోసం కొరటాల శివ రెండు సార్లు రీ వర్క్ చేసాడు.కొడితే కుంభస్థలం బద్దలు అవ్వాలి అనే కసితో కథని తయారు చేసాడు.

ఇక ఈ చిత్రం లో పని చేసే తారాగణం కూడా భారీగానే ఉంది.ఇప్పటికే ఈ సినిమా లో జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.రీసెంట్ గానే అండర్ వాటర్ లో వీళ్లిద్దరి మీద ఒక భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించాడు కొరటాల శివ.ఈ సన్నివేశం సినిమాకే హైలైట్ కాబోతుందట.అంతే కాదు ఈ సినిమా కోసం అర్రి అలెక్స్ LF కెమెరాని ఉపయోగిస్తున్నారట.

Advertisement

దీని ఖరీదు సుమారు గా 80 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా.#RRR సినిమాని ఈ కెమేరాతోనే షూట్ చేసారు.ప్రపంచం లోనే అత్యంత ఖరీదైన కెమెరా ఇదేనట.

ఈ కెమెరా తో ఇప్పటి వరకు జాన్ విక్ 4 , ది బ్యాట్ మ్యాన్,జోకర్, యాంట్ మ్యాన్, స్ట్రేంజర్ థింగ్స్, డ్యూన్ మరియు టెర్మినేటర్ వంటి హాలీవుడ్ చిత్రాలను తెరకెక్కించారు.

ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడు.అందులో ఒక పాత్ర పేరు దేవర,( Devara ) సముద్ర ఖనిజాలను స్ముగ్లింగ్ చేసే పాత్రలో ఇందులో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు.

ముఖ్యంగా అండర్ వాటర్ లో వచ్చే పోరాట సన్నివేశాలు మొత్తం ఈ సినిమాకి హైలైట్ గా నిలవబోతుందట.ఎన్టీఆర్ నట విశ్వరూపం మొత్తం ఈ సినిమా లో చూడొచ్చని అంటున్నారు.

సమాధులు తవ్వి ఆడ శవాలపై అత్యాచారాలు చేస్తున్న పాక్ వ్యక్తి.. కట్ చేస్తే..?
ఆ సంపాదనను అనాథ పిల్లల కోసం ఖర్చు చేస్తున్న రామ్ చరణ్.. గ్రేట్ హీరో అంటూ?

ఇప్పటికే ఈ చిత్రం పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.ఇక టీజర్ వచ్చే సమయానికి అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు.

Advertisement

చూడాలి మరి ఎన్టీఆర్ ఈ సినిమాతో మరో సారి పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాడో లేదో అనేది.

తాజా వార్తలు